Bhagavanth Kesari: బాలయ్య కోసం శ్రీలీల రిస్క్.. ఇప్పటి వాళ్లు ఎవరూ చేయని సీన్స్‌లో!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు తెరకెక్కుతోన్న క్రేజీ మూవీల్లో 'భగవంత్ కేసరి' ఒకటి. 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ చేస్తున్న చిత్రం ఇది. దీన్ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన అనిల్ రావిపూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.
నటిసింహా నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడితో కలయికలో రాబోతున్న 'భగవంత్ కేసరి' సినిమాను ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. అందుకు ఏమాత్రం తగ్గకుండా చిత్ర యూనిట్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇందులో భాగంగానే ఈ మూవీ షూటింగ్‌ను అస్సలు బ్రేకులు లేకుండా శరవేగంగా జరుపుకుంటూ వస్తోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన 90 శాతానికి పైగానే టాకీ పార్టును కూడా పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

అదిరిపోయే కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'భగవంత్ కేసరి' సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో ఆమె ఏకంగా బాలకృష్ణకు కూతురిగా కనిపించబోతుందని ఎప్పుడో న్యూస్ లీకైంది. అంతేకాదు, ఈ చిత్రంలో వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కంటతడి పెట్టించేంత ఎమోషనల్‌గా సాగుతాయని కూడా టాక్ వినిపిస్తోంది.
ఇక, 'భగవంత్ కేసరి' సినిమాలో శ్రీలీల పాత్రకు సంబంధించి ఓ కీలకమైన న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో ఆమె ఎంతో డేరింగ్ ఉన్న అమ్మాయిలా కనిపించబోతుందట. అంతేకాదు, సినిమాలో శ్రీలీల కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో సైతం భాగం అయిందని తెలిసింది. ముఖ్యంగా బాలయ్యతో కలిసి ఓ ఫైట్ సీన్ కూడా చేసిందని, అది అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ మూవీ కోసం శ్రీలీల బాగానే రిస్క్ తీసుకుందని కొందరు అనుకుంటున్నారు.

ఇక, 'భగవంత్ కేసరి' మూవీని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే, పాల్లక్ లల్వానీ కీలక పాత్రను చేస్తోంది. అర్జున్ రాంపాల్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే దసరాకు విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.


Click it and Unblock the Notifications











