శ్రీలీలా నిశ్చితార్థం.. శుభవార్త చెప్పిన యంగ్ సెన్సేషన్.. కానీ

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా నిశ్చితార్థం అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. ఆమె స్వయంగా కొన్ని ఫొటోలను పంచుకోవడంతో ఆ రూమర్లు పుటుకొచ్చాయి. శ్రీలీలా పంచుకున్న ఫొటోలపై అభిమానులతో పాటు నెటిజన్లు ఇలా మాట్లాడుకుంటున్నారు. గుడ్ న్యూస్ చెప్పేందుకే ఆ ఫోటోలను పెట్టిందా? అని సందేహిస్తున్నారు. ఇంతకీ ఆ ఫొట్లోని సారాంశం ఏంటనే వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో రచ్చ చేసి..
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీలా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న వయస్సులోనే స్టార్ హీరోల సరసన నటిస్తూ దుమ్ములేపుతోంది. ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం, పుష్ప 2లో ఐటెమ్ సాంగ్ చేసి టాలీవుడ్ లో రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. పాతికేళ్లలోనే తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపూపేసింది. చివరిగా నితిన్ సరసన రాబిన్ హుడ్ చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించింది.

Sreeleela Engagement Rumours Tollywood Sensation Shared Picture

తాజాగా పంచుకున్న ఫొటోల సారాంశం..
శ్రీలీలా స్టార్ హీరోలతో నటిస్తూ ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ తన అభిమానులతోనూ టచ్ లోనే ఉంటుంది. వారికోసం సోషల్ మీడియాలో ప్రత్యేకమైన పోస్టులు పెడుతూ తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్ స్టా స్టోరీ ద్వారా పంచుకుంది. ఆ ఫొటోలో పెద్దవాళ్లు శ్రీలీలాకు పసుపు రాసి, ఆశీర్వదిస్తున్నట్టుగా ఉన్నాయి. పైగా ఆ ఫొటోలను పంచుకుంటూ 'బిగ్ డే', 'కమింగ్ సూన్' అంటూ క్యాప్షన్ ఇవ్వడం కూడా ఆసక్తికరంగా మారింది. దీంతో శ్రీలీలా ఎంగేజ్ మెంట్ చేసుకుందని కథనాలు వస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

కానీ.. శ్రీలీలా చెప్పబోయేది ఇదేనా..
అయితే శ్రీలీలా వయస్సు ప్రస్తుతం 23 ఏళ్లు మాత్రమే. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ గా ఎదిగి కాస్తా స్థిరత్వాన్ని పొందుతోంది. ఇదే సమయంలో శ్రీలీలా తెలుగుతో పాటు ఇతర భాషల చిత్రాల నుంచి అవకాశాలు అందుతున్నాయి. ఇలాంటి క్రమంలో శ్రీలీలా ఎర్లీగా పెళ్లి చేసుకునే సాహసం చేయబోదని అంటున్నారు. ఆ ఫొటోలు కేవలం కమర్షియల్ యాడ్ కు సంబంధించినవై ఉంటాయని, లేదంటే తమ ఇంట్లో ఎవరైనా శుభాకార్యానికి సంబంధించినవై ఉంటాయంటున్నారు. ఇక మున్ముందు క్లారిటీ రానుంది.

శ్రీలీలా నెక్ట్స్ సినిమాలివే..
వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్నా శ్రీలీలాకు సినిమా ఆఫర్లు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.
ఆమె ఎనర్జీ, క్రేజ్, డ్యాన్స్ కు ప్రేక్షకులకు ఫిదా అవుతుండటంతో నిర్మాతలు, దర్శకులు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. తెలుగులో జూనియర్, రెండోసారి రవితేజ సరసన మాస్ జాతర, పరాశక్తి, అక్కినేని అఖిల్ సరసన లెనిన్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు బాలీవుడ్ లో 'ఆషికీ 3'లో నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం అక్కడ బ్లాక్ బాస్టర్ అయితే మాత్రం శ్రీలీలాకు బాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు అందే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు.

More from Filmibeat

Read more about: sreeleela engagement tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X