శ్రీలీలకి చెమటలు పట్టించిన నేషనల్ క్రష్.. కిస్సిక్ బ్యూటీ హాట్ కామెంట్స్

ఇపుడు తెలుగు సినిమా దగ్గర ఉన్న మంచి మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారు అంటే వారిలో టాప్ రేంజ్ లో మాత్రం ఇద్దరే హీరోయిన్స్ పోటా పోటీగా కనిపిస్తారు అని చెప్పవచ్చు. కాగా ఆ హీరోయిన్స్ ఎవరో కూడా కాదు ఒకరు నేషనల్ క్రష్ రష్మిక అయితే మరో హీరోయిన్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల అని చెప్పాలి. ఇలా ఈ ఇద్దరు కూడా కెరీర్ స్టార్ట్ చేసిన కొన్నేళ్ల లోనే పాన్ ఇండియా లెవెల్లో ఒక వెలుగు వెలుగుతున్నారు.

కాగా ఓ పక్క ఆల్రెడీ రష్మిక మందన్నా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయ్యిపోతే తన బాటలోనే ఈ యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా అడుగులు వేస్తూ హిందీ సినిమా వరకు తన ప్రయాణం కొనసాగిస్తుంది. అయితే ఈ ఇద్దరు సెన్సేషనల్ హీరోయిన్స్ లో కొన్ని పాయింట్స్ మాత్రం సినిమా పరంగా కామన్ గా కలుస్తున్నట్టు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి.

sreeleela felt tension with rashmika mandanna on this matter

ఇలా ఈ ఇద్దరు కూడా ఇండియన్ సినిమాని ఏలేస్తున్నారు. ఇక ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాలో కూడా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రమే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ చిత్రం పుష్ప 2 లో కనిపించారు. అయితే ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా కనిపిస్తే శ్రీలీల కిస్సిక్ అనే సాంగ్ లో షైన్ అయ్యింది. ఇలా ఈ సాంగ్ లో మాత్రం ఈ ఇద్దరు టాప్ బ్యూటీలు అల్లు అర్జున్ పక్కన కనిపించారు.

మరి ఈ సాంగ్ విషయంలో యంగ్ హీరోయిన్ శ్రీలీలని రష్మిక తెగ టెన్షన్ పెట్టేసిందట. రీసెంట్ గా ఈ విషయాన్ని శ్రీలీల రివీల్ చేసింది. తాను చేసిన ఆ సాంగ్ సమయంలో రష్మికతో మాట్లాడ్డానికే తనకి టెన్షన్ వచ్చేసింది అని చెప్పుకొచ్చింది. అయితే తనకంటే సీనియర్ అనో లేక పెద్ద హీరోయిన్ అనో కారణం చేత కాదట. ఇపుడు శ్రీలీల నటించిన చిత్రం రాబిన్ హుడ్ సినిమాలో నిజానికి రష్మిక నటించాల్సి ఉంది.

ఆమెనే మొదట మేకర్స్ అనౌన్స్ చేశారు కానీ పలు కారణాలు రీత్యా రష్మిక తప్పుకునేసరికి శ్రీలీల వచ్చింది. అలా ఆమె స్థానంలోకియో తాను వచ్చిన కారణంగా మొదట రష్మికాని ఫేస్ చేసేందుకు తాను చాలా ఇబ్బంది పడినట్టుగా ఆమె తెలిపింది. అంతే కాకుండా కిస్సిక్ సాంగ్ కూడా మొదట ఆమె ఒప్పుకోలేదట. తర్వాత దర్శకుడు సుకుమార్ ఆమెని కన్విన్స్ చేసి ఫైనల్ గా ఒప్పించారట.

ఈ తర్వాత సెట్స్ లోకి అడుగు పెట్టాక సాంగ్ షూట్ లో ఎట్టకేలకి రష్మికతో ఈ యంగ్ హీరోయిన్ మాట్లాడేసేసరికి మొత్తం సెట్ అయ్యిందట. ఇక శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఈ మార్చ్ 28న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే రష్మిక మందన్నా నటించిన ఛావా సినిమా హిందీలో రికార్డులు తిరగరాస్తుంటే ఈ సినిమా తర్వాత మరో హిందీ సినిమా సల్మాన్ ఖాన్ సరసన నటించిన సికందర్ తో రష్మిక రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X