PVT04: మెగా మూవీ నుంచి సర్‌ప్రైజ్.. మాయ చేస్తోన్న సెన్సేషన్ శ్రీలీల
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తున్నారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే సెన్సేషన్‌గా మారుతోన్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల ఒకరు. బెంగళూరుకు చెందిన ఈ అమ్మడు 2019లో వచ్చిన 'కిస్' అనే కన్నడ చిత్రంతో సినిమాల్లోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 2021లో ఆమె 'పెళ్లి సందD' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులర్ అయింది. ఈ క్రమంలోనే రవితేజ 'ధమాకా'తో శ్రీలీల కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది.
కన్నడ బ్యూటీ శ్రీలీల ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో భాగం అయింది. అందులో రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న ఓ మూవీతో పాటు పవర్ స్టార పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు.. విజయ్ దేవరకొండ 12వ సినిమాతో పాటు నితిన్ మూవీలోనూ ఈ అమ్మడు హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న చిత్రంలోనూ శ్రీలీల నటిస్తోంది. ఇలా ఇప్పటికే చాలా చిత్రాల్లో భాగమైన ఈ క్యూట్ లేడీ.. ఇప్పుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తోన్న సినిమాలోనూ చేస్తోంది.

మొదటి చిత్రం తర్వాత కెరీర్‌ను ఆశించిన రీతిలో తీసుకు వెళ్లలేకపోతోన్న మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్.. ఇప్పుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి అనే దర్శకుడితో కలిసి తన నాలుగో సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఆమె పాత్ర పేరును చిత్ర అని పరిచయం చేశారు. ఇక, ఈ పోస్టర్‌లో శ్రీలీల ఎంతో క్యూట్‌గా కనిపిస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది.
ఇదిలా ఉండగా.. PVT04 అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











