బాలీవుడ్ లో శ్రీలీలాకి అవమానం... యంగ్ టాలెంట్ కు ఇదేం గతి!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్ లో సంచలనంగా మారిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే మంచి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ ప్రారంభం నుంచి శ్రీలీలా నటించిన చిత్రంలో ఆమె పాత్రకు మంచి క్రేజ్ దక్కేలా చూసుకుంటోంది. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా సినిమాలను ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో థియేటర్లలో సందడి చేస్తోంది. అతి చిన్న వయస్సులోనే టాలీవుడ్ లోని అగ్రహీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందీ ముద్దుగుమ్మ.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాస్ మహారాజా రవితేజ లాంటి స్టార్స్ సరసన నటించి యంగ్ ఏజ్ లోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. తన డ్యాన్స్, ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, ఆకట్టుకునే అందంతో తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది. దానికి తగ్గట్టుగానే శ్రీలీలా రెమ్యునరేషన్ లో డిమాండ్ చేసింది. టాలీవుడ్ లో 'పెళ్లి సందD' చిత్రంతో మొదలైన తన కెరీర్ 'గుంటూరు కారం' వరకు యమస్పీడ్ గా సాగింది. కేవలం మూడేళ్లలోనే పది చిత్రాలకు సైన్ చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది.

Sreeleela get low Remunation in Bollywood is this her first remuneration for debut film in Hindi

పెళ్లి సందడి, ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం, పుష్ప2తో అలరించిన విషయం తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ రాబిన్ హుడ్, మాస్ జాతర వంటి చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే.. తెలుగు చిత్రాలకే శ్రీలీలా రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందంట. కేవలం 'పుష్ప2'లో స్పెషల్ అప్ఫీయరెన్స్ కు రూ.2 కోట్ల వరకు ఛార్జీ చేసిందంట శ్రీలీలా. అంటే ఆరేంజ్ లో శ్రీలీలాకు తెలుగు ఇండస్ట్రీలో మార్కెట్ ఉంది. దీంతో దర్శకనిర్మాతలూ ఆసక్తి చూపించారు.

ఇదే ఊపులో శ్రీలీలా బాలీవుడ్ బాట పట్టింది. ఇటీవల కాలంలో బీటౌన్ లో ఈ ముద్దుగుమ్మ కనిపిస్తున్న విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్ తనయుడు అబ్రహం అలీఖాన్ తో ఒక సినిమా చేయబోతుందని టాక్. ఇక ఇప్పటికీ మ్యూజికల్ హిట్ ఆషికీ3లో కార్తీర్ ఆర్యన్ సరసన శ్రీలీలా నటిస్తోంది. అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు.... ఇటీవల టైటిల్ ను అనౌన్స్ చేయకుండా ఓ రొమాంటిక్ గ్లింప్స్ ను మాత్రం రిలీజ్ చేశారు. శ్రీలీలా నయా పెర్ఫామెన్స్ తో ఆకట్టుకోబోతోందని అర్థం అవుతోంది.

కాగా.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడమంటే హీరోయిన్ల మార్కెట్ మరింతగా పెరుగుతుందని అర్థం. కానీ శ్రీలీలా విషయం రివర్స్ లో జరిగిందంట. తెలుగులో నెత్తిన పెట్టుకొని తిరుగుతున్న ఈ యంగ్ టాలెంట్ కు అక్కడ రెమ్యునరేషన్ విషయంలో అవమానం జరిగిందనే టాక్ వినిపిస్తోంది. శ్రీలీలాకు రూ.1.75 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే చెల్లించి సినిమా ఆఫర్ చేస్తున్నారంట. అయినా శ్రీలీలా మొగ్గుచూపుతుందని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంత ఉందో గానీ.. శ్రీలీలా తెలుగులోనే దాదాపు రూ.3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా.. బాలీవుడ్ లోకి వెళ్లి అలాంటి పరిస్థితిని ఎదుర్కొవాల్సిన అవసరం ఏముందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X