శ్రీలీలపై మనసు పడ్డ క్రికెటర్.. గుంటూరు కారంలో డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసలు!

సినీ తారలకు క్రికెటర్లంటే ఇష్టపడటం.. అలాగే క్రికెటర్లు సినీతారలపై మోజు పడటం కొత్తేమీ కాదు. మైదానంలో బంతిని బౌండరీ దాటిస్తుంటే.. సినిమా యాక్టర్లు ఈలవేసి.. చప్పట్లు కొట్టి ఆనందపడిపోతుంటారు. అలాగే వెండితెర మీద హీరో, హీరోయిన్లు చెలరేగిపోయి రొమాన్స్ పండిస్తూ క్రికెటర్లు సాధారణ సినీ అభిమానులుగా మారిపోతుంటారు. ఇలాంటి పరిస్థితి క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌‌ ఎదురైంది. ఆయన ఇటీవల విడుదలైన గుంటూరుకారం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

నాకు సినిమాలంటే ఇష్టమే కానీ.. వాటి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. వాటి గురించి అంతగా విశ్లేషించే టాలెంట్ లేదు. అయితే ఇటీవల మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా చూశాను. మీరు కూడా తప్పకుండా చూడండి. ఆ మూవీ చాలా జాలీగా ఉండటమే కాకుండా ఫుల్లుగా వినోదంతో కూడిన సినిమా అని అశ్విన్ అన్నాడు.

Sreeleela gets Fanboy moments from Cricketer Ravichanndran Ashwin From Mahesh Babu s Guntur Kaaram

ఇక గుంటూరు కారంలో శ్రీలీల గురించి ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె డ్యాన్స్ అమోఘం. అద్బుతంగా స్టెప్పులు వేసింది. ఆమె వేసిన డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే. నీవు చూశావా? చూడకపోతే తప్పకుండా చూడాల్సిందే అని తనతో మాట్లాడుతున్న వ్యక్తికి సలహా ఇచ్చాడు.

అయితే అశ్విన్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి మాత్రం నాకు సినిమాలంటే ఆసక్తి ఉండదు. నేను ఎక్కువగా సినిమాలు చూడను. చూస్తే కేవలం రజనీకాంత్ సినిమాలు మాత్రమే చూస్తాను అని అంటే.. నీవు సినిమా మొత్తం చూడాల్సిన పనిలేదు. నీవు య్యూట్యూబ్‌లో కూడా చూడొచ్చు అంటూ సలహా ఇచ్చారు.

గుంటూరు కారం సినిమాలో శ్రీలీల పాట చూడటానికి.. యూట్యూబ్‌లో వెళ్లి గుంటూరు కారం శ్రీలీల డ్యాన్స్ పాట అని టైప్ చేయండి. వీడియో వస్తుంది. నీవు చూశావంటే.. మీకు కూడా మతిపోతుంది. మహేష్ బాబు కూడా ఎక్ట్రార్డినరీగా డ్యాన్స్ చేశాడు. ఆయన గొప్ప డ్యాన్సర్ కూడా. ఆయనకు మంచి శ్రీలీల కూడా డ్యాన్స్ చేసింది అని అశ్విన్ చెప్పారు.

Sreeleela gets Fanboy moments from Cricketer Ravichanndran Ashwin From Mahesh Babu s Guntur Kaaram

ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.. సంక్రాంతి కానుకగా జనవరి 12వతేదీన రిలీజైన సినిమా భారీ కలెక్షన్లు సాదించింది. ఈ సినిమాపై నెగిటివ్ రివ్యూస్ వచ్చినా.. వాటిని ఎదురించి రికార్డు కలెక్షన్లు సాధించింది. సుమారుగా 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X