Sreeleela Remuneration: శ్రీలీల రెమ్యునరేషన్‌పై భారీ దెబ్బ... పరాశక్తి మూవీకి పారితోషికం ఎంతంటే?
విలక్షణ దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న సుధా కొంగర దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ నటించిన చిత్రం పరాశక్తి. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1960వ దశకంలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంతో పాటు పలు వాస్తవ సంఘటనల ఆధారంగా పరాశక్తి మూవీని తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో పరాశక్తి మూవీలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన హీరోయిన్ శ్రీలీల పారితోషికంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో శ్రీలీల పారితోషికం ఎంత? అనేది పరిశీలిస్తే...
తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్
కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టి తన క్యూట్ లుక్స్, అందం, డ్యాన్సింగ్ స్కిల్స్‌తో స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు శ్రీలీల. చిన్న వయసులోమహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ వంటి అగ్రనటులతో నటించే అవకాశం దక్కించుకున్నారు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ తన అదృష్టంతో కంటిన్యూగా ఆఫర్లు అందుకుంటున్నారు శ్రీలీల. చిన్న హీరోలు, సీనియర్ హీరోలకు శ్రీలీల ఫస్ట్ ఛాయిస్‌గా మారారు.

పాన్ ఇండియా హీరోయిన్‌గా అడుగులు
తెలుగులో టాప్ హీరోయిన్ అనిపించుకున్న శ్రీలీల.. ఇతర భాషల్లోనూ తన అదృష్టం పరీక్షించుకోవాలనే ప్లానింగ్‌లో ఉన్నారు. ఇప్పటికే కన్నడంలో నటించిన శ్రీలీల... పుష్ప 2లోని కిస్సింగ్ సాంగ్‌తో నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు శ్రీలీల. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. అంతకంటే ముందే తమిళంలో ఎంట్రీ ఇచ్చారు శ్రీలీల. అదే పరాశక్తి చిత్రం.
పరాశక్తి బడ్జెట్ ఎంతంటే?
డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ పరాశక్తి సినిమాను నిర్మించారు. రవి మోహన్, అథర్వ, ప్రకాష్ బెల్వాడీ, కులప్పుల్లి లీల, దేవ్ రామ్‌నాథ్, పృథ్వీ రాజన్, గురు సోమసుందరం, చేతన్, పాప్రి ఘోష్‌లు కీలకపాత్రలు పోషించగా... రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్‌లు గెస్ట్ రోల్‌లో నటించారు. రవి కే చంద్రన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా... సతీష్ సూర్య ఎడిటర్‌గా పనిచేశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి పరాశక్తి మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది.
శ్రీలీలకు షాకింగ్ రెమ్యునరేషన్
ఈ సినిమాకు గాను శ్రీలీల ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఆసక్తిగా మారింది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ కోటి రూపాయల వరకు పారితోషికం ముట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే శ్రీలీల తెలుగు చేసిన గత చిత్రాలకు అందుకున్న మొత్తాల కంటే ఇది తక్కువ కావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. గతేడాది విడుదలైన మాస్ జాతర శ్రీలీల చివరిగా చేసిన సినిమా. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రానికి గాను శ్రీలీల 3 కోట్ల రూపాయల వరకు పారితోషికంగా అందుకున్నారని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీనికి ముందు చేసిన జూనియర్‌కు 4 కోట్ల రూపాయలు, రాబిన్‌హుడ్‌కు 2 కోట్ల రూపాయల వరకు ఆమె ఛార్జ్ చేశారు. అలాంటిది ఇప్పుడు పరాశక్తికి ఇంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే వరుస ఫ్లాపులకు తోడు బడ్జెట్ లెక్కలు, ఇతర కారణాలతో శ్రీలీల.. పరాశక్తి మూవీకి పారితోషికాన్ని తగ్గించుకున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











