Sreeleela టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న శ్రీలీల.. ఏడుగురు అగ్రహీరోలతో.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్‌లో అతివేగంగా స్టార్ హీరోయిన్‌గా మారిన హీరోయిన్లలో శ్రీలీల అంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. పెళ్లి సందD చిత్రంతో ప్రేక్షకులను తన గ్లామర్‌తో ఆకట్టుకొన్న ఈ ముద్దు గుమ్మ.. వరుస ప్రాజెక్టులతో తెలుగు సినిమా పరిశ్రమలో దూసుకెళ్తున్నది.
తన రెండో సినిమా ధమాకా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగు పరిశ్రమలో అగ్ర హీరోల సరసన చోటు దక్కించుకొన్న ఈ గ్లామర్ తార ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే..

పెళ్లిసందD, ధమాకా చిత్రాల విజయాల వెనుక శ్రీలీల గ్లామర్ ప్రధాన పాత్ర పోషించిందనే విషయాన్ని సినీ వర్గాలు పేర్కొంటున్నారు. కేవలం శ్రీలీల డ్యాన్సులు, ఊపుల కారణంగానే ప్రేక్షకులు ఆ సినిమాలకు కనెక్ట్ అయ్యారనే విషయం మీడియాలోను, సగటు ప్రేక్షకుల్లోను హాట్ టాపిక్‌గా మారింది. ధమాకా సినిమాను కమర్షియల్ ట్రాక్ పట్టించిన భామను భారీ ఆఫర్లు చుట్టుముడుతున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్‌లో రామ్ పోతినేని, నితిన్, విజయ్ దేవరకొండ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి హీరోలతో నటిస్తున్నారు. బాలకృష్ణ, రామ్, బోయపాటి చిత్రంలోను, పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లోను ఈ భామ నటిస్తున్నది. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించే చిత్రంలో అవకాశాన్ని కొట్టేసింది.
టాలీవుడ్‌లో శ్రీలీల అవకాశాలను చేజిక్కించుకొంటున్న తీరు చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. ఆమె దూకుడు చూసి చాలా మంది ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 7 భారీ చిత్రాలు ఉండటం విశేషంగా మారింది. గతంలో అనుష్క లాంటి హీరోయిన్లు ఇలా బీజీగా ఉండేవారు. వారి జాబితాలో శ్రీలీల చేరిందనే మాట వినిపిస్తున్నది.

ఇదిలా ఉండగా, ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సావాలకు శ్రీలీల ఆహ్వానం అందుకొన్నది. ఇండస్ట్రీలో అతికొద్ది మంది హీరోలకే ఈ అవకాశం దక్కింది. అందులో శ్రీలీల ఉండటం ఆమెకు ఉన్న క్రేజ్‌ను తెలియజెప్పిందనే విషయాన్ని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక శ్రీలీల రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో ఏ హీరోయిన్ అందుకొని విధంగా పారితోషికం తీసుకొంటున్నదనేది టాక్. హిందీ, మలయాళం నుంచి దిగుమతి అయ్యే హీరోయిన్ల కంటే ఎక్కువగా శ్రీలీల రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు సమాచారం. ఈ భామ 1.5 నుంచి 2 కోట్ల మధ్య పారితోషికం తీసుకొంటున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











