Sreeleela డేంజర్ పిల్లగా శ్రీలీల.. యువ హీరో గుండెల్లో గుబులు రేపుతున్న ధమాకా బ్యూటీ
టాలీవుడ్ అందాల భామ శ్రీలీల జోరు యమాగా సాగుతున్నది. వరుస సినిమాలతో ఈ గ్లామర్ క్వీన్ దూసుకెళ్తున్నది. అందం, అభినయంతోనే కాకుండా డ్యాన్సులతో ఈ ముద్దుగుమ్మ ఇరుగదీస్తున్నది. ధమాకా చిత్రంతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకొన్న శ్రీలీల డజన్‌కుపైగా సినిమాలతో బిజీగా మారిపోయింది.
తాజాగా ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్ అనే సినిమాలో యువ హీరో నితిన్‌తో కలిసి శ్రీలీల జంటగా నటించింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను సంగీత ప్రియులు, సినీ అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. ఆ సినిమా వివరాలు, ఆ పాట విశేషాల్లోకి వెళితే...

రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో, మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జైరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రేమకథా చిత్రం ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్. ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. తన మనసు దోచుకొన్న అమ్మాయిని ప్రేమతో టీజ్ చేస్తూ ఉండే డేంజర్ పిల్లా పాటను తాజాగా రిలీజ్ చేశారు.
అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా
చీకట్లో తిరగని తళుకువ
ఒక ముళ్లు కూడా లేనే లేని రోజా పువ్వా
రేర్ పీసే నువ్వా
కలలు కనదట.. కన్నెతి కనదట.. కరుకు మగువట హోయ్
నగలు బరువట.. గుణమే నిధి అట.. ఎగిరి పడదట హోయ్
డేంజర్ పిల్లా.. డేంజర్ పిల్లా.. అంటూ సాగే పాటను కృష్ణకాంత్ రాయగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటను విదేశాల్లో అందమైన లొకేషన్లలో భారీగా చిత్రీకరించారు.

నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్ చిత్రం శరవేగంగా షూటింగు పూర్తి చేసుకొంటున్నది. ఈ సినిమా ఇప్పటికే 60 శాతం పూర్తయింది. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్ చిత్రంలో నితిన్ తన కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ చేయని రోల్‌లో ఆకట్టుకోవడం గ్యారెంటీ. తన ఫ్యాన్స్‌నే కాకుండా, ప్రేక్షకులను కూడా నితిన్ తన పెర్ఫామెన్స్‌తో మెప్పిస్తాడని నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి తెలిపారు. కిక్ తర్వాత ఆ స్థాయి కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కుతున్న చిత్రమని డైరెక్టర్ వక్కంతం వంశీ తెలిపారు.


Click it and Unblock the Notifications











