Sreeleela డ్యాన్స్, స్టెప్పులతో రెచ్చిపోయిన శ్రీలీల.. ప్రోమోలోనే ఈ రేంజ్‌లో ఉంటే?
ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం స్కంధ. సుబ్రమణ్యస్వామి, కార్తికేయ దేవుడికి మారుపేరైన స్కంధ లాంటి పవర్‌ఫుల్ టైటిల్‌తో వస్తున్న చిత్రాన్ని శ్రినివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోలో శ్రీలీల రెచ్చిపోయి స్టెప్పులు వేసినట్టు కనిపించింది. ఆ వివరాల్లోకి వెళితే..
యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న స్కంధ మూవీలో అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలోని విజువల్స్‌కు గూస్‌బంప్స్ వచ్చే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అదించడమే కాకుండా పాటలను కూడా హై ఎనర్జీ బీట్స్ ఇచ్చినట్టు తెలిసింది.

తాజాగా స్కంధ సినిమాలోని నీ చుట్టు చుట్టూ అనే పాటను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పాటలో రామ్ పోతినేని, శ్రీలీల స్టెప్పులతో ఇరుగదీసినట్టు ప్రమో స్పష్టం చేసింది. ఈ పాటకు తమన్ అందించిన మ్యూజిక్ బాగుందనిపిస్తున్నది. వెస్ట్రన్ స్టయిల్‌లో సాగే పాట వినగానే జోష్ పుట్టించేలా ఉంది.
స్కంధ చిత్రంలో నీ చుట్టు చుట్టూ అనే పాటలో శ్రీలీల మరోసారి డ్యాన్స్ విశ్వరూపం చూపించిందా? అనే రేంజ్‌లో స్టెప్పులు వేసింది. పాటలో శ్రీలీల లుక్స్, బాడీ లాంగ్వేజ్, హావభావాలు కిల్లింగ్‌గా ఉన్నాయి. శ్రీలీల వేసిన స్టెప్పులు యువతకు గిలిగింతలు పెట్టేలా ఉన్నాయి.

ధమాకా చిత్రంలో శ్రీలీల వేసిన డ్యాన్స్ స్టెప్పులను ఇంకా తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేదనే చెప్పాలి. ఆ సినిమా విజయానికి శ్రీలీల డ్యాన్స్ మూమెంట్స్ ఓ కారణం అంటూ సినీ వర్గాలు, సాధారణ ప్రేక్షకుల చెప్పకనే చెప్పారు. ఈ స్కంధ పాట ప్రోమో మరోసారి ఆమె గ్రాఫ్‌ను పెంచేలా ఉంది.
స్కంధ సినిమా విషయానికి వస్తే.. రామ్ పోతినేనికి ఇది తొలి పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రానికి సంతోష్ డేటేక్ డీవోపీగా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











