Sreeleela శ్రీలీల అందాల ఆరబోత.. బోల్డ్ ఫోటోషూట్‌తో మైండ్ బ్లోయింగ్!
నిన్న మొన్నటి వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.
పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ సోయగం శ్రీలీల. అయితే మొదటి సినిమాతో పెద్దగా గుర్తింపు సంపాదించుకోనప్పటికీ సెకండ్ సినిమానే రవితేజ వంటి సీనియర్ హీరో తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆయనతో శ్రీలీల చేసిన ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వరుసగా అవకాశాలు ఆమె ఇంటి తలుపు తట్టాయి. ఇంకేముంది చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల దాకా అందరితోనూ ఆడి పాడేసింది. పంజా వైష్ణవ్ తేజ్, నితిన్ లాంటి యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు బాలయ్య, మహేష్ బాబు లాంటి సీనియర్ హీరోలను కూడా కవర్ చేసింది.

ఆమె స్పీడ్ చూసి తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ గా సెటిల్ అవ్వడం ఖాయం అనుకున్నారంతా. కానీ ఊహించని విధంగా ఒక దశలో ఆమె టాలీవుడ్ కు దూరమైంది. ఒక్క ధమాకా తప్ప ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. గుంటూరు కారం మూవీతో శ్రీలీల ఫేట్ మారిపోతుందని అంతా అనుకున్నారు. అయితే నిజంగానే ఆ మూవీ తర్వాత శ్రీ లీల కెరీర్ మారిపోయింది.
కానీ అంతా అనుకుంటున్నట్టుగా పీక్స్ లోకి వెళ్లలేదు. కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వరస డిజాస్టర్లతో సతమతమవుతున్న శ్రీలీల కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవట్లేదని, కేవలం రెమ్యూనరేషన్ కోసమే పని చేస్తుందని విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె నటించిన గత మూడు సినిమాలు ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం సినిమాలు పెద్దగా ఆడలేదు. గుంటూరు కారం యావరేజ్ అయితే మిగతా రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.
దీంతో గుంటూరు కారం మూవీ తర్వాత కాస్త బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యింది ఈ బ్యూటీ. అంతలోపు తన డాక్టర్ చదువుపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకొని ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో ఆమె కొన్ని సినిమాలకు నో చెప్పింది అనే పుకార్లు షికార్లు చేశాయి. అయితే శ్రీలీల కోలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోందని అక్కడ మీడియా కోడై కూస్తోంది.

అది కూడా అజిత్ లాంటి స్టార్ హీరో సినిమాలో అని టాక్ నడుస్తోంది. అజిత్ నెక్స్ట్ మూవీలో ఈ బ్యూటీ కీలక పాత్ర పోషించబోతోందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. ఈలోపు సోషల్ మీడియా వేదికగా తన అందమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది.అందులో భాగంగానే తాజాగా శ్రీలీల బ్లూ డెనిమ్ ప్యాంట్ ధరించి దానిపై స్లీవ్ లెస్ టాప్ లో దర్శనమిచ్చింది.
శ్రీలీల షేర్ చేసిన ఆ హాట్ ఫోటోలను చూశాక అభిమానులు మళ్లీ రీ ఎంట్రీ ఎప్పుడు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈమెను వెండితెరపై చూడలేకపోతున్నామే అని శ్రీలీల ఫాలోవర్స్ బాగానే మిస్ అవుతున్నారు. త్వరలోనే మంచి ప్రాజెక్టుతో శ్రీలీల మళ్లీ ధమాకా చూపించేందుకు రెడీ అవుతున్నది.


Click it and Unblock the Notifications











