శ్రీలీలాకు బ్యాడ్ టైమ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురితో టఫ్ ఫైట్

టాలీవుడ్ సెన్సేషనల్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీలా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన పెళ్లి సందD చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది. తన నటనతో, అందంతో, డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. తొలి చిత్రంతోనే తన టాలెంట్ చూపించడంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా సినిమా ఆఫర్లు అందుతూ వచ్చాయి. శ్రీ లీల కూడా సినిమా సినిమా కు మరింత క్రేజ్ దక్కించుకుంటూ వచ్చింది.

రీసెంట్ గా శ్రీ లీల టాలీవుడ్ స్టార్ నితిన్ సరసన నటించిన రాబిన్ హుడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. తొలిరోజే డిజాస్టర్ టాక్ ను పొందింది. అయితే నితిన్ తో అంతకుముందు నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రం కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఇలా శ్రీలీలతో నటిచ్చిన రెండు చిత్రాలు నితిన్ కు ఘోర పరాజయాన్ని తెచ్చిపెట్టాయి. ఇక శ్రీలీలా నటించిన మరో రెండు చిత్రాలు స్కంద, ఆది కేశవ చిత్రాలు కూడా డిజాస్టర్ గానే మీలాయి.

Sreeleela Lost Bollywood Project Due to her Back to Back failures

శ్రీలీలా కెరియర్లో ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం చిత్రాలు మాత్రమే సక్సెస్ ని అందించాయి. ఇక మిగిలిన చిత్రాలన్నీ ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేదు. అయినప్పటికిని శ్రీలీలాకు క్రేజ్ పెరుగుతూనే వచ్చింది. దీంతో ఏకంగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన ఆషీకీ3 చిత్రంలో నటిస్తోంది. అయితే టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ తో బాలీవుడ్లో రెండు మూడు ప్రాజెక్టుల్లో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వచ్చాయి.

కానీ ఇక్కడ పరిస్థితి వేరేగా ఉండడంతో శ్రీలీలా చేతి వరకు వచ్చిన ఓ బాలీవుడ్ చిత్రం మిస్ అయినట్టు తెలుస్తుంది. అది కూడా తన కోస్టార్ కార్తీక్ ఆర్యన్ సరసన నటించే ఛాన్స్ ను కోల్పోయిందని తెలుస్తోంది. పతి పత్ని అవుర్ వో 2 చిత్రంలో హీరోయిన్గా ముందుగా శ్రీలీలను అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో గాని ఉన్నట్టు ఉండి శ్రీలీలాను తీసేసి ఆమెకు బదులు బాలీవుడ్ యంగ్ బ్యూటీ రాష తడాని ని ఎంపిక చేశారని తెలుస్తోంది. అయితే శ్రీ లీల సక్సెస్ రేట్ తక్కువగా ఉండడం కారణంగా ఇలా జరిగి ఉంటుందని అంటున్నారు.

మరోవైపు బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టండన్ కూతురుగా రాష తడాని నార్త్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇక ఆమె కూడా నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. బాలీవుడ్ సినీ విశేషాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. రాష తడాని అందంలోనూ శ్రీలీలాకు దీటుగా ఉంటుంది. మరోవైపు ఆమె మొదటి చిత్రం ఆజాద్ ద్వారా ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. ఇక శ్రీ లీలకు బాలీవుడ్ లో ఇలాంటి ప్రాజెక్ట్స్ లేవు. దాంతో అక్కడ ఆమె కెరియర్ ఎలా ఉంటుందనేది చూడాలి.

More from Filmibeat

Read more about: sreeleela rasha thadani bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X