పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల తల్లిపై పోలీస్ కేసు.. భర్త కారణంగానే అసలు గొడవ!

ఇటీవల కాలంలో సౌత్ ఇండియాలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న హీరోయిన్స్ లలో శ్రీ లీల ఒకరు. పెళ్లి సందడి సినిమాతో పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు తెలుగులో మరిన్ని ఆఫర్లు అందుకుంటుంది. అయితే ఆమె సినిమాలతో చాలా బిజీగా ఉందంటూ వార్తలు వస్తున్న తరుణంలో మొదటిసారి ఒక పోలీస్ కేసు కు సంబంధించిన వార్తల్లో నిలిచింది. అది కూడా వారి తల్లిదండ్రుల సమస్య కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

శ్రీ లీల తల్లిపై కేసు నమోదు అయినట్లుగా కన్నడ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. శ్రీ లీల తల్లి స్వర్ణాలత పై ఆమె తండ్రి పోలీస్ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే శ్రీ లీలా తండ్రి సుధాకర్ రావు అలాగే తల్లి స్వర్ణలత ఇద్దరు ఇరవై ఏళ్ల క్రితం విడిపోయారు ఎవరికి వారు సొంత జీవితాలను గడుపుతున్నారు. ఇక తల్లి స్వర్ణలత శ్రీలీల మాత్రం కలిసే ఉంటున్నారు.

Sreeleela mother another issue with her husband and fir registered

ఈ తరుణంలో మధ్యలో కొన్ని గొడవలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల అక్టోబర్ 3న కోరమంగళం లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లోనే ఇంటి తాళం పగలగొట్టి స్వర్ణలత వెళ్ళి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేసింది అని ఆమె భర్త సుబాకర్ తెలియజేశారు. అయితే అది తమకు చెందిన ఆస్తి అంటూ స్వర్ణలత కూడా ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక సుబాకర్ స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో స్వర్ణలతపై పోలీస్ కేసు నమోదు చేశారు. దీంతో ఈ విషయం కన్నడ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది.

ప్రస్తుతం తెలుగులో కూడా శ్రీలీల పేరు గట్టిగా వినిపిస్తూ ఉండడంతో ఇక్కడ కూడా ఆ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇదివరకే స్వర్ణలత పై కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. అలియాన్స్ యూనివర్సిటీ వివాదంలో ఆమెపై ఏ2 కేసు నమోదు అయినట్లు సమాచారం. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సమయంలో కేసు నమోదు అయింది.

ఇక శ్రీలీల అయితే తెలుగు చిత్ర పరిశ్రమలు మంచి అవకాశాలు అందుకుంటుంది. పెళ్లి సందడి సినిమా తర్వాత ఆమె రవితేజ ధమాకా సినిమాలో మంచి అవకాశం అందుకుంది. ఇక ఇప్పుడు నవీన్ పోలిశెట్టితో కూడా ఒక సినిమా చేస్తోంది. మరోవైపు కన్నడలో గాలి జనార్దన్ రెడ్డి తనయుడు నటిస్తున్న స్టూడెంట్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా కనిపించబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X