జూనియర్ ఎన్టీఆర్ తో శ్రీలీలా తల్లి ప్రామీస్.. 1997లో జరిగిందిదే!

టాలీవుడ్ లోకి సునామీలాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీలా. తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. చిన్న చిత్రంతో మొదలైన తన కెరీర్ ప్రస్తుతం స్టార్ హీరోలతో నటించే వరకు వెళ్లిందంటే మాములు విషయం కాదు. అయితే శ్రీలీలా సక్సెస్ సీక్రెట్ గురించి తన తల్లి స్వర్ణలత తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదే సమయంలో గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తారక్ ను కూడా కలిశానని, అప్పుడు తనతో ఒక మాట కూడా అన్నానని, ఇప్పుడు నిజం చేసి తీరినట్టు చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ సీనియర్ హీరో, విలక్షణ నటుడు జగపతి బాబు హోస్ట్ గా ఇటీవల ఒక టాక్ షో మొదలైంది. జమ్మయు నిశ్చయమ్ము రా విత్ జగపతి అనే టైటిల్ తో టీవీ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు కింగ్ అక్కినేని నాగార్జున హాజరై సందడి చేశారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ లుగా స్టార్ హీరోయిన్ శ్రీలీలా, ఆమె తల్లి డాక్టర్ స్వర్ణలత హాజరవ్వడం విశేషం. ఈ సందర్భంగా జగపతి బాబు ఆమెను పలు ప్రశ్నలు అడిగారు. తారక్ చిన్నప్పటి ఫొటో ఒకటి చూపించి ఏదైనా చెప్పగలరా అని అడిగితే స్వర్ణలత ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది.

Sreeleela Mother Revealed the Secret behind her Daughter Dance Skills she Promised to Tarak

ఆమె మాట్లాడుతూ.. 'ఇది తారక్ చిన్నప్పటి ఫొటో. అమెరికాలో ఒక ఈవెంట్ లో తను భరతనాట్యం చేస్తున్నప్పటిది. ఆ ఫొటో చూసి నాకు ఆడపిల్ల పుడితే తారక్ లాగే పాపకి డ్యాన్స్ నేర్పించాలని అనుకున్నాను. 1997లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో తానా సభలు నిర్వహించారు. మేము అప్పుడు అక్కడే ఉండేది. ఇక సభలకు వెళ్లాం. ఆ ప్లాట్ ఫాంలో అప్పుడు తారక్ భరతనాట్యంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక అప్పుడే తారక్ తో అన్నాను. నాకు ఆడపిల్ల పుడితే కచ్చితంగా మీలాగే డ్యాన్స్ చేయిస్తానని చెప్పాను.' అని చెప్పుకొచ్చింది.

ఇక శ్రీలీలాకు స్వర్ణలత 2001లో జన్మనిచ్చింది. జూన్ 14న శ్రీలీలా స్వర్ణలత వ్యాపారవేత్త సుభాకర రావులకు జన్మించింది. శ్రీలీలా పుట్టిన కొన్నాళ్లకు వాళ్లిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి శ్రీలీలాను తల్లి స్వర్ణలతనే పెంచింది. ఇక చిన్నప్పటి నుంచే ఆటా పాటలతో పాటు చదువులోనూ రాణించేలా శ్రద్ధ వహించింది. శ్రీలీలాలకు 4 ఏళ్లు ఉన్నప్పటి నుంచే భరతనాట్యంపై శిక్షణ ఇప్పించింది. దాని వల్లనే శ్రీలీలా ఇప్పుడు అంత బాగా డ్యాన్స్ చేయగలుతుంది.

ఇప్పటికీ శ్రీలీలా సినిమాల విషయంలో తల్లి స్వర్ణలతనే ఫైనల్ డిసీషన్ చేస్తూ ఉంటుంది. కూతురు వెంటనే ఉంటూ అన్ని విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ వస్తోంది. ఇక శ్రీలీలా టాలీవడులోకి పెళ్లి సందడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ ధమాకా చిత్రంతో హిట్ అందుకుని సెన్సేషన్ గా మారింది. ఆ తర్వాత స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం, పుష్ఫ 2లో స్పెషల్ సాంగ్ తో ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నెక్ట్స్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర, హిందీలో ఆషికీ 3 చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X