శ్రీలీల మూవీ ఫెస్టివల్.. ఒక్కో పండక్కి ఒక్కో సినిమా రిలీజ్.. హీరోయిన్ రికార్డ్

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కడా చూసిన వినిపిస్తున్న పేరు శ్రీలీల (Sreeleela). అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గానే కాకుండా బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటిఫుల్. సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన పెళ్లి సందD సినిమాతో మోస్ట్ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ధమాకా మూవీతో హ్యూజ్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. దీంతో శ్రీలీల వెంట వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అంతేకాకుండా వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు ఒక్కో పండుగకు ఒక్కో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది ఈ చిన్నది.

అగ్ర హీరోలతో 7 చిత్రాలు : తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ శ్రీలీల. అగ్ర హీరోల సరసన జోడీ కడుతూ ఏకంగా 7 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ మూవీ ఫెస్టివల్ మొదలు కానుంది. వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు ఒక్కో పండుగకు ఒక్కో మూవీతో అలరించనుంది. ఐదు నెలల్లో ఐదు సినిమాలతో థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ గా రికార్డ్ కెక్కింది.

Sreeleela Movie Festival: Skanda To Guntur Kaaram Movie Released On Each Festival

'స్కంద'తో మొదలు : శ్రీలీల చేస్తున్న సినిమాలన్నీ క్రేజీ మూవీసే. అందులో ఒకటి స్కంద (Skanda The Attacker). రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సూపర్ కాంబోలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియాగా వస్తున్న ఈ మూవీ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 18న రిలీజ్ కానుంది. ఇలా గణేష్ చతుర్థితో శ్రీలీల సినీ జాతర షురు చేయనుంది.

Sreeleela Movie Festival: Skanda To Guntur Kaaram Movie Released On Each Festival

బాలయ్యతో : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగల్లో ఒకటైన విజయ దశమికి భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాతో సందడి చేయనుంది శ్రీలీల. నందమూరి నటసింహం బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీలది కీలక పాత్ర. అయితే ఆమె రోల్ ఏంటన్నది కాస్త సస్పెన్స్ గా ఉంది. ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానుంది.

Sreeleela Movie Festival: Skanda To Guntur Kaaram Movie Released On Each Festival

ఆది కేశవ మూవీతో : దీపావళికి కూడా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయింది డేంజర్ పిల్ల శ్రీలీల. దివాళీకి రెడీ అయిన శ్రీలీల మూవీ ఆది కేశవ (Aadikeshava Movie). పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నారు. అయితే ఈ సినిమాను మొదట ఆగస్టులోనే రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ, తాజాగా నవంబర్ 10కి వాయిదా పడింది. దీంతో దివాళికీ కూడా శ్రీలీల మూవీ రానుంది.

Sreeleela Movie Festival: Skanda To Guntur Kaaram Movie Released On Each Festival

క్రిస్మస్ పండుగకు : తెలుగు పండుగలే కాకుండా క్రిస్మస్ ఫెస్టివల్ కు కూడా శ్రీలీల సినిమా ఏ మాత్రం మిస్ కావడం లేదు. చాలా గ్యాప్ తర్వాత రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వం చేపట్టిన సినిమా "ఎక్స్‌ట్రా- ఆర్డినరీ మ్యాన్" (Extra Ordinary Man Movie 2023). ఇందులో నితిన్ కు జోడీగా నటించింది శ్రీలీల. ఈ సినిమా డిసెంబర్ 23న విడుదలకు సిద్ధంగా ఉంది.

Sreeleela Movie Festival: Skanda To Guntur Kaaram Movie Released On Each Festival

సంక్రాంతికి ముగింపు : ఇప్పటివరకు ఉన్న సినిమాలు ఒక ఎత్తు అయితే.. శ్రీలీల చేస్తున్న గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ మరో ఎత్తు. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో మూడోసారి వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే స్థానంలో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారు. స్టార్ హీరోయిన్ ను పక్కకు నెట్టి మరి అవకాశం అందుకున్న ఈ సినిమా ఆమెకు నిజంగా స్పెషలే. ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కానుంది.

Sreeleela Movie Festival: Skanda To Guntur Kaaram Movie Released On Each Festival

మరికొన్ని చిత్రాలు : బ్యూటిఫుల్ శ్రీలీల ఇలా ఐదు నెలల్లో ఐదు సినిమాలు మాత్రమే కాకుండా మరికొంతమంది క్రేజీ హీరోలతో నటిస్తోంది. వారిలో పవన్ కల్యాణ్ ఒకరు. పవన్-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో శ్రీలీల హీరోయిన్. అలాగే విజయ్ దేవరకొండతో కూడా ఓ సినిమా చేస్తుంది ఈ బ్యూటి. ఇలా మరికొన్ని సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఈ చిన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X