ఆ రూల్ బ్రేక్.. నాపై ఆ ఆశలు పెట్టుకోవద్దంటున్న శ్రీలీల..

అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన క్యూట్‌నెస్‌తో ఈ బ్యూటీ ఎంతో మంది మదిని దోచేసింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. పెళ్లి సండది సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, తన క్యూట్‌నెస్, డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే వరుస అవకాశాలు వచ్చినా, సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కొంతకాలం అవకాశాలు తగ్గాయి.

ఈ సమయంలో పుష్ప 2 (Pushpa 2: The Rule)లో ఐటమ్ సాంగ్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది.ఈ మూవీపై భారీ అంచనాలు ఆకాశాన్ని తాకగా, తాజాగా.. ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ శ్రీలీల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి.

Sreeleela on Pawan Kalyan Dance in Ustaad Bhagat Singh A Rare Magical Moment

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీ లీల వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె పవర్ స్టార్‌తో చేసిన అనుభవాలను ఆసక్తికరంగా పంచుకుంది. ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నిస్తూ... 'శ్రీలీల అంటే డాన్స్, ఎనర్జీ గుర్తొస్తాయి. ఇప్పటికే రాశి ఖన్నా పవన్ కళ్యాణ్‌తో డ్యాన్స్ చేసిన సీన్స్ చూశాం. మరి మీరు కూడా ఆయనతో డ్యాన్స్ చేస్తారా?'అని అడిగారు. దీనికి శ్రీలీల సూటిగా స్పందిస్తూ..'అలాంటి ఆశలు పెట్టుకోకండి'అని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

శ్రీలీల ప్రకారం.. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌కు డ్యాన్స్ చేయడం అవసరం లేదని, అలాంటి సీన్స్ పెట్టడం కూడా సరైనది కాదని దర్శకుడు హరీష్ శంకర్ భావించారని తెలిపింది.అందుకే తనకు పవన్ కళ్యాణ్‌తో ఫుల్ లెంగ్త్ డ్యాన్స్ లేదని స్పష్టం చేసింది. అయితే తనకంటూ ఓ స్పెషల్ సాంగ్ ఉందని, అందులో చిన్న మూమెంట్ మాత్రమే పవన్‌తో కలిసి చేసినట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా ఆ అనుభవం గురించి మాట్లాడుతూ ఆమె ఎమోషనల్ అయింది. 'ఆ చిన్న మూమెంట్ కూడా నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. పవన్ కళ్యాణ్ గారితో డ్యాన్స్ చేయాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. అది మాటల్లో చెప్పలేని ఫీలింగ్' అని చెప్పింది.

అలాగే పవన్ కళ్యాణ్ వర్కింగ్ స్టైల్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'ఈ మధ్య కాలంలో ఆయన ఇలా స్టెప్పులు వేయడం చాలా రేర్. డైరెక్టర్, డాన్స్ మాస్టర్, పవన్ గారికి ఒక ప్రత్యేకమైన అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే షూట్ చేస్తారు. ఇచ్చిన చిన్న మూమెంట్‌ను కూడా ఆయన టేక్‌గా మార్చేస్తారు' అని తెలిపింది. మరింతగా ఆమె మాట్లాడుతూ.. 'ఆ క్షణంలోనే నాకు అర్థమైంది, పవన్ కళ్యాణ్ గారు 24 గంటలు తన క్యారెక్టర్‌లోనే ఉంటారని. ఆయనతో ఒక చిన్న స్టెప్ చేసినా నాకు చాలా హ్యాపీగా అనిపించింది' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

పవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన కెరీర్‌లో గొప్ప మైలురాయిగా భావిస్తున్నట్లు శ్రీలీల ఎమోషనల్‌గా తెలిపింది. ఈ భారీ సినిమాలో రాశిఖన్నా మరో హీరోయిన్‌గా నటిస్తుండగా, ఉగాది కానుకగా మార్చి 19న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా, థియేటర్లలో పవన్ కళ్యాణ్ వింటేజ్ మాస్ అవతార్‌ను ఎలా చూపించబోతుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X