అలా వేధించారు.. ఇండస్ట్రీని వదిలేద్దామని అనుకున్నా.. శ్రీలీల ఎమోషనల్

చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ అనిపించుకుని దూసుకెళ్తున్నారు శ్రీలీల. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ మాత్రం అదృష్టంతో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే పరాశక్తి మూవీతో అభిమానులను పలకరించడంతో పాటు తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఆమె నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజైంది. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా యాంకర్ సుమ కనకాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

పెళ్లి సందD అనే మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తన క్యూట్ లుక్స్, అందం, డ్యాన్సింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకుంటున్నారు శ్రీలీల. ఏ హీరోయిన్‌కైనా స్టార్స్ పక్కన నటిస్తే గుర్తింపు, గౌరవం, స్టార్‌డమ్ లభిస్తుందని ఒక ఆశ. అయితే దీనిని చాలా చిన్న వయసులోనే అందుకున్నారు శ్రీలీల. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ వంటి అగ్రనటులతో నటించే అవకాశం పొందారు. ప్రస్తుతం చిన్న హీరోలు, సీనియర్ హీరోలకు శ్రీలీల ఫస్ట్ ఛాయిస్‌గా మారారు.

Sreeleela Opens Up About Early Career Trolls and Emotional Struggles

తన సీనియర్స్ బాటలోనే పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగేందుకు కృషి చేస్తున్నారు శ్రీలీల. పుష్ప 2లోని కిస్సింగ్ సాంగ్‌తో నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇటీవలే శివకార్తీకేయన్ హీరోగా నటించిన పరాశక్తి ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ వెంటనే ధనుష్ హీరోగా నటిస్తోన్న మూవీలో ఆయన సరసన హీరోయిన్‌గా ఎంపికయ్యారు. బాలీవుడ్‌లో అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు శ్రీలీల. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌తో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్‌ మార్చి 19న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీలో పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో ఆమె నటించారు.

సినీ పరిశ్రమలో నటీనటులపై సోషల్ మీడియాలో వేధింపులు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఎందరో వీటి బారినపడి మానసికంగా కుమిలిపోతున్నారు. కొందరు వీటిపై రియాక్ట్ అవుతుండగా.. మరికొందరు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. స్టార్స్‌తో పాటు వర్ధమాన తారలపైనా ట్రోలింగ్ దారుణంగా జరుగుతోంది. నటీనటులే కాదు.. సినిమాలు కూడా ఈ ట్రోలింగ్ కారణంగా దారుణంగా దెబ్బతింటున్నాయి. దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలియక దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. అనేక చిత్ర పరిశ్రమలు సోషల్ మీడియాలో వేధింపులను ఎదుర్కోవడానికి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకోవడం, పోలీసులను ఆశ్రయించడం జరుగుతోంది.

మరోవైపు.. తనపైనా కెరీర్ స్టార్టింగ్‌లో తీవ్రంగా వేధింపులు ఎదురైనట్లు యాంకర్ సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల వెల్లడించింది. కెరీర్ స్టార్టింగ్‌లో ట్రోల్స్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. వీటి వల్ల బాధపడే దానిని, ఏడ్చేదానిని. అమ్మ దగ్గరికి వెళ్లి కాలేజీకి వెళ్లి చదువుకుంటాను, నేను ఇంక సినిమాలు చేయను అని చెప్పేశా. తొలి నుంచి సెన్సిటివ్. ఈరోజుల్లో జనం కొంచెం తెలివిగా ఉంటున్నారు. ఒకరిపై వచ్చే నెగిటివ్ కామెంట్స్‌పై రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నెగిటివ్ ట్రోలింగ్‌ను ఎదుర్కొనే ధైర్యం వచ్చిందని శ్రీలీల తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X