నేను అలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నా.. : శ్రీలీల

టాలీవుడ్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela).ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది ఈ అమ్మడు. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ బ్యూటీ, హిట్-ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తనకిష్టమైన కథలు, పాత్రలతో ముందుకు సాగుతోంది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటిస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా ఆమె కెరీర్‌లో కీలక మలుపు అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న "మాస్ జాతర" చిత్రంలోనూ శ్రీలీల ప్రధాన పాత్రలో కనిపించనుంది.

సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, శ్రీలీల తన అభిమానులతో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ, సోషల్ మీడియా ద్వారా లేదా ఇంటర్వ్యూలలో తన ఆలోచనలను పంచుకుంటుంది. తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Sreeleela Opens Up About Her Film Choices and Boundaries

ఇంటర్వ్యూలో యాంకర్, "గతంలో సీఈఓ పాత్ర వస్తే దాన్ని ఎందుకు రిజెక్ట్ చేశావు?" అని అడగగా, శ్రీలీల స్పష్టమైన సమాధానం ఇచ్చింది. "వాస్తవానికి నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలు పెళ్లి సందడి, ధమాకా వంటి ప్రాజెక్టులు ఆ సమయంలోనే సైన్‌ చేశాను. అప్పట్లో ఇండస్ట్రీకి నేను కొత్త. ఏ పాత్రలు ఎంచుకోవాలో, ఏవి చేయకూడదో సరిగా తెలియదు. 'సీఈఓ పాత్ర' అంటే కాస్త భయపడ్డాను. ఆ పాత్ర నాపై బరువుగా అనిపించింది, అందుకే చేయలేదు," అని చెప్పింది శ్రీలీల.

ఆ తరువాత పాత్రలను సెలెక్టివ్ గా ఎన్నుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. "నేను సెలెక్టివ్‌గా ఎంచుకోవడం లేదు. కానీ ఏ పాత్ర చేస్తున్నా నేను కంఫర్ట్‌గా ఉన్నానా? అది నా కంఫర్ట్ జోన్‌కి అవతలదా? అనేది మాత్రం చూసుకుంటా. ప్రతి పాత్ర నాకు ఏదో ఒక కొత్త విషయం నేర్పింది. కొన్ని రోల్స్‌ నాకు నటిగా ఎదగడానికి సహాయం చేశాయి, మరికొన్ని నన్ను డాన్సర్‌గా గుర్తింపును తెచ్చాయి. ఇవన్నీ నా లెర్నింగ్ జర్నీ లో భాగం," అని తెలిపింది.

శ్రీలీల తన ఆలోచనల్లో ఎల్లప్పుడూ గ్రౌండెడ్‌గా ఉండే వ్యక్తి అని ఈ ఇంటర్వ్యూలో మరోసారి రుజువైంది. "ప్రతి మనిషికి తప్పులు చేయడం సహజం. కానీ వాటిని గుర్తించి సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం. నేను కూడా కొన్ని పాత్రలు చేయకపోవడమే మంచిదని గ్రహించాను. ప్రతి అనుభవం నాకు ఒక పాఠంలా మారింది," అని చెప్పింది. తనకు అభిమానుల ప్రేమ, ఫ్యామిలీ ఆడియన్స్ అండ చాలా ముఖ్యమని శ్రీలీల పేర్కొంది. "ప్రేక్షకులు నా జర్నీని చాలా దగ్గరగా ఫాలో అవుతున్నారు. కొందరు అభిమానులు నన్ను కుటుంబ సభ్యుల్లా చూస్తున్నారు. అలాంటి ఫ్యామిలీ ఆడియన్స్‌ దొరకడం నా అదృష్టం," అని ఆనందం వ్యక్తం చేసింది.

"మీరు ఎలాంటి స్క్రిప్ట్లు ఎంచుకుంటారు?" అని ప్రశ్నించగా.. "నేను చేసే సినిమాలు ఫ్యామిలీ అందరూ కలిసి చూడగలిగేలా ఉండాలి. నా పెళ్లయిన తర్వాత కూడా నా ఫ్యామిలీ, పిల్లలతో కూర్చొని చూసేలా ఉండే సినిమాలు చేయాలనుకుంటా. అందుకే నేను బోల్డ్ లేదా బియాండ్ లిమిట్స్ పాత్రలు చేయను. నేను ఇంట్లో ప్రతి విషయాన్ని చర్చిస్తాను. నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు బలం," అని చెప్పింది. అయితే, ఆమె తన ఆలోచనలు కూడా టైమ్‌తో మారవచ్చని ఓపెన్‌గా అంగీకరించింది.

"కొన్ని సందర్భాల్లో మన నిర్ణయాలు మారుతాయి. ఆ సమయానికి సరైనది అనిపించింది, కానీ తర్వాత కాదు. కాలం మారితే మనం కూడా మారాలి. అయితే స్టేట్మెంట్ ఇవ్వడంలో జాగ్రత్త అవసరం. నేను ఇంకా యంగ్‌ని, కొన్ని బౌండరీస్‌లోనే ఉన్నా. నన్ను నేను ఇంకా డిస్కవర్ చేసుకుంటున్నా," అని చెప్పింది శ్రీలీల. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆమె "ఉస్తాద్ భగత్ సింగ్", "మాస్ జాతర" చిత్రాలతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఈ సినిమాలు హిట్ అయితే, టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ లిస్ట్‌లో శ్రీలీల పేరు నిలిచిపోవడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X