చెన్నై కుర్రాళ్లంటే క్రష్.. మనసులో మాట బయటపెట్టిన శ్రీలీల

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నటీనటులు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడుతున్నారు. కొందరు సీక్రెట్‌గా తమ బంధాన్ని ఇంకా కొనసాగిస్తుండగా.. మరికొందరు మాత్రం బయటపెట్టేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల పెళ్లి గురించి గతంలో రూమర్స్ వినిపించాయి. అయితే వాటిని కొట్టిపారేశారు శ్రీలీల. తాజాగా ఆమె వివాహానికి సంబంధించి మరో న్యూస్ బయటికొచ్చింది. స్వయంగా శ్రీలీల ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ వివరాల్లోకి వెళితే..

పెళ్లి సందD అనే మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు శ్రీలీల. తన క్యూట్ లుక్స్, అందం, డ్యాన్సింగ్ స్కిల్స్‌తో త్వరగానే మేకర్స్ కళ్లలో పడ్డారు శ్రీలీల. చాలా చిన్న వయసులోనే స్టార్‌డమ్ అందుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ వంటి సూపర్‌స్టార్స్‌ నటించే అవకాశం దక్కించుకున్నారు. తెలుగు, కన్నడంలో సత్తా చాటిన శ్రీలీల.. పాన్ ఇండియా హీరోయిన్ అయ్యేందుకు పావులు కదుపుతున్నారు.

Sreeleela Opens Up About Marriage Plans Says Will I Marry in Chennai Like Nayanthara

పుష్ప 2లోని కిస్సింగ్ సాంగ్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో శివకార్తీకేయన్ హీరోగా నటించిన పరాశక్తి ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ వెంటనే ధనుష్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. బాలీవుడ్‌లో అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు శ్రీలీల. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

డాక్టర్ కావాలన్నది తన కల అని పలుమార్లు తెలిపిన శ్రీలీల.. షూటింగ్స్‌లో పాల్గొంటూనే చదువుకున్నారు. ఆమె కష్టం ఫలించి ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ పట్టా అందుకున్నారు. ఫిబ్రవరి 10న ముంబైలోని డీవై పాటిల్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో 2020 బ్యాచ్‌తో కలిసి పట్టా పొందారు. వరుసగా అవకాశాలు అందుకుంటున్నప్పటికీ సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో శ్రీలీల కెరీర్ డైలామాలో పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో ఇప్పటి వరకు గ్లామర్, కమర్షియల్ పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చిన ఆమె ఇకపై బలమైన కథాంశం ఉన్న సినిమాలపై దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తోందట. వైవిధ్యమైన పాత్రలే తనలోని ప్రతిభను బయటికి తీసుకొస్తాయని భావిస్తోంది.

తాజాగా చెన్నైలోని అమృత ఏవియేషన్ కాలేజ్ ఈవెంట్‌లో శ్రీలీల సందడి చేశారు. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న శ్రీలీల విద్యార్ధులతో ముచ్చటిస్తూ తన జీవితంలోని పాఠాలను పంచుకున్నారు. మనం ప్రయత్నించడానికి భయపడాలి తప్ప.. ఓడిపోవడానికి కాదు, ఓటమి రుచి చూడకపోతే సక్సెస్ విలువ మనకు తెలియదని శ్రీలీల అన్నారు. ఇదే సమయంలో విద్యార్ధులంతా ఆమెను లేడీ సూపర్‌స్టార్.. లేడీ సూపర్‌స్టార్ అని పిలవడంతో శ్రీలీల ఆ ట్యాగ్‌ను తిరస్కరించారు. నాకు ఇష్టమైన నటి నయనతార.. ఆమే అసలైన లేడీ సూపర్‌స్టార్. ఆమె నాకు రోల్ మోడల్.. ఆ స్థాయికి చేరుకోవడానికి నాకు ఇంకా చాలా టైమ్ పడుతుందని శ్రీలీల తన అభిమానం చాటుకున్నారు.

ఇదే సమయంలో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీలీల. చెన్నై కుర్రాళ్లు చాలా స్వీట్ .. నగరంలోని దోశ అంటే నాకు చాలా ఇష్టం. నయనతార మాదిరిగా నేను కూడా చెన్నైలోనే పెళ్లి చేసుకుంటానా అనేది తెలియదని శ్రీలీల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. శ్రీలీల తమిళనాడుకు కోడలిగా వెళ్లనున్నారా? చెన్నై కుర్రాడితో ప్రేమలో పడ్డారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: sreeleela nayanthara movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X