రాబిన్ హుడ్ స్పెషల్ సాంగ్ కాంట్రావర్సీ.. శ్రీలీల సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం చిత్రంలో నటించిన ఇప్పించింది. ఏకంగా మహేష్ బాబుకు దీటుగా పెర్ఫార్మన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తన డాన్స్ తోనూ రచ్చ లేపిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి వచ్చింది.
టాలీవుడ్ స్టార్ నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రం రాబిన్ హుడ్. ఈ చిత్రంలో శ్రీలీలా హీరోయిన్ గా నటించింది. మరో యంగ్ హీరోయిన్ కేతిక శర్మ స్పెషల్ సాంగ్ లో నటించింది. మార్చి 28న రాబిన్ హుడ్ చిత్రం గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు కేదికా శర్మ నటించిన అది ద సర్ప్రైజ్ స్పెషల్ సాంగ్ కాంట్రవర్సీని ఎదుర్కొంది. ఈ సాంగ్ లో కేతిక శర్మ వేసిన స్టెప్పులు కాంట్రవర్సీకి దారితీసాయి.

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ సాంగ్ కు డాన్స్ స్టెప్పులు డిజైన్ చేశారు. అయితే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కేతిక శర్మ వేసిన స్టెప్పులు కొంతమందికి అభ్యంతరంగా అనిపించాయి. అంతేకాదు ఆ సాంగ్ పై ఏకంగా తెలంగాణ స్టేట్ విమెన్ కమిషన్ కూడా స్పందించింది. కేతిక శర్మతో వేయించిన కొన్ని స్టెప్పులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళలను కించపరిచేలా ఉన్న స్టెప్పులపై మండిపడింది. ఇలాంటి వాటికి ఫిలిం మేకర్స్ ఏ బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది.
ఇక ఈ కాంట్రవర్సీపై తాజాగా శ్రీలీలా స్పందించింది. హీరోయిన్లు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. ఇక నేను కూడా స్పెషల్ సాంగ్లో నటించాను. అయితే మాకు ఇబ్బంది లేనంతవరకు స్పెషల్ సాంగ్స్ లో నటించడం తప్పుగా భావించడం లేదు. రాబిన్ హుడ్ లోని స్పెషల్ సాంగ్ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నా. ఇక మహిళా కమిషన్ అభ్యంతరం చెప్పడం కూడా గమనించదగినదే. సమాజంలో మహిళలకు ఎలాంటి హక్కులు కల్పించాలో వారికి బాగా తెలిసి ఉంటుంది. వారు అభిప్రాయాన్ని కూడా గౌరవించాల్సిందే.
స్పెషల్ సాంగ్స్ విషయంలో తనకు ఉన్న అభిప్రాయాన్ని ఇలా చెప్పినట్టు తెలియజేసింది. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేసింది. ఇక రాబిన్ హుడ్ చిత్రంలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలిపింది. ఇప్పటివరకు తన కెరీర్లో చేయని పాత్ర అది అని చెప్పుకొచ్చింది. ఇక ఈ చిత్రంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ చిత్రంతోనే డేవిడ్ వార్నర్ బిగ్ స్క్రీన్ పై మొట్టమొదటిసారిగా కనిపించబోతున్నారు. ఇక శ్రీలీలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ తో కూడా అలరించాల్సి ఉంది. మరోవైపు బాలీవుడ్ లోనూ ఆషీకి 3 చిత్రంతో నార్త్ లో అడుగు పెట్టబోతోంది.


Click it and Unblock the Notifications











