బాత్రూమ్ లో శ్రీలీల ఫోటోషూట్.... ఇంకెక్కడా ప్లేస్ దొరకలేదా అంటూ ట్రోల్స్

కన్నడ భామ శ్రీలీల గుంటూరు కారం తరువాత తెలుగు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్లీ వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తన బోల్డ్‌ ఫోటోషూట్‌తో కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే పలు సినిమాల ద్వారా కుర్రాళ్ల మనసు దోచుకున్న శ్రీలీల తాజాగా బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయింది. అయితే ఆమె లేటెస్ట్ ఫోటోలు చూసిన నెటిజన్లు ఇంకెక్కడా చోటు దొరకాలేదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. హాట్ ఫోటోలపై ఇలాంటి కామెంట్లు ఎందుకు విన్పిస్తున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ టైమ్ లోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అతి కొద్ది మంది నటీమణుల్లో శ్రీలీల ఒకరు. సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన పెళ్లి సందడి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ వరుస అవకాశాలతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

Sreeleela Photoshoot in washroom getting negative comments

అతి తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే ఇటీవల కాలంలో వరుసగా ఆమె సినిమాలు పరాజయం పాలవ్వడంతో శ్రీలీలకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో ఒక్కసారిగా ఆలోచనలో పడిన ఈ బ్యూటీ కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయింది. ఆ తరువాత కోలీవుడ్ లో అజిత్ సినిమాలో నటిస్తోందని టాక్ నడిచింది.

మరోవైపు ఆమె బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతోందని అంటున్నారు. స్టార్ హీరో కొడుకు సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందనే సమాచారం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ నటిస్తున్న చిత్రంలో శ్రీలీల కథానాయికగా సెలెక్ట్ అయ్యిందని అంటున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. జన్నత్ ఫేమ్ కునాల్ దేశ్‌ముఖ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

Sreeleela Photoshoot in washroom getting negative comments

కాగా ఈ నేపథ్యంలోనే శ్రీలీల వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్ లతో మరింత మంది ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడింది. తాజాగా ఈ అమ్మడు మినీ బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ షో చేసిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే శ్రీలీల బాత్రూంలో అద్దం ముందు ఈ ఫోటో షూట్ చేయడం గమనార్హం. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు మరో ప్లేస్ దొరకాలేదా ? అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Sreeleela Photoshoot in washroom getting negative comments

ఇదిలా ఉండగా ప్రస్తుతం శ్రీలీల రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటోంది. కేవలం 7 సంవత్సరాల నుంచే సినిమా ఇండస్ట్రీలో నటిస్తున్న ఈ బ్యూటీ అప్పుడే కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటోందని టాక్ నడుస్తోంది. స్టార్ నటులతో నటించిన తర్వాత నటిగా స్టార్ డమ్ పెరిగింది. గుంటూరు కారం సినిమాతో శ్రీలీల పారితోషికం లక్షల నుంచి కోట్లకు ఎగబాకింది. శ్రీలీల తదుపరి చిత్రాల కోసం రూ. 3 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోంది ఈ అమ్మడు.

More from Filmibeat

Read more about: sree leela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X