sreeleela: యంగ్ హీరోతో శ్రీలీల రొమాన్స్.. స్టార్ హీరో కొడుకు భలే ప్లానింగ్!
అందాల బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టి.. స్టార్ హీరోయిన్ గా మారింది. వరుసగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ పట్టేసింది. అయితే సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆమె బాలీవుడ్ ఎంట్రీకి ఘనంగా ఏర్పాట్లు చేసుకొన్నది. ఓ సూపర్ స్టార్ కొడుకుతో హిందీలో ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
అసలు ఒక ఏడాదిలోనే అమ్మడు డజన్ కు పైగా సినిమాలను లైన్లో పెట్టింది. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు అనే తేడా లేకుండా అందరూ సినిమాలకు ఓకే చెప్పింది. అయితే తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడు అన్నట్లు .. శ్రీలీల ఈ సినిమాలతో హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ పొజిషన్ కు వెళ్ళాలి అనుకుంది.

కానీ, ఆమె నటించిన ఏ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. దీంతో అమ్మడు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అప్పటిలా ఏ సినిమా పడితే ఆ సినిమా కాకుండా శ్రీలీల మంచి కథలను ఎంచుకుంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ నడుస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీల.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ కొడుకు ఇబ్రహీం ఆలీఖాన్ దిలేర్ అనే సినిమా చేస్తున్నాడు. కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. త్వరలోనే అధికారికంగా ఈ సినిమాను ప్రకటిస్తారని బాలీవుడ్ మీడియా కథనం.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ కు మంచి ప్రాధాన్యత ఉండడంతో స్టార్ హీరోయిన్‌ను తీసుకొనే పనిలో ఉన్నారట. మొదట మృణాల్ ఠాకూర్ ను ఈ పాత్ర కోసం తీసుకోవాలని అనుకున్నారట. కానీ, శ్రీలీల అయితే బావుంటుందని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే శ్రీలీల ను మేకర్స్ సంప్రదించారని, ఆమె కూడా ఓకే చెప్పిందని టాక్ నడుస్తోంది. నిజం చెప్పాలంటే శ్రీలీల కు ఇది మంచి ఛాన్స్. అక్కడ కూడా ఒక హిట్ పడింది అంటే ఇక అమ్మడిని ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పడం లో ఏటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమాతో శ్రీలీల ఎలాంటి విజయాన్ని అందుకుంటుదో చూడాలి.


Click it and Unblock the Notifications











