Sreeleela: జూనియర్ సినిమాకు శ్రీలీలా పారితోషికం.. మరి ఇంత తక్కువగానా?

స్టార్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఆ మధ్యలో వరుస పెట్టి సినిమాలతో టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు సక్సెస్ రందీ తాకింది. దీంతో తన రాబోయే చిత్రాలపై మరింత ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో తనకు వచ్చిన ఆఫర్లను దక్కించుకుంటూ వినియోగించుకుంటూ వెళ్తోంది. అయితే శ్రీలీలాలకు సరైన హిట్ లేకపోవడంతో పారితోషికం విషయంలో కోత విధిస్తున్నారని తెలుస్తోంది. నెక్ట్స్ ఈ ముద్దుగుమ్మ జూనియర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి శ్రీలీలా తీసుకున్న రెమ్యునరేషన్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

జూనియర్ చిత్రంలో వైరల్ వయ్యారిగా..
శ్రీలీలా నుంచి నెక్ట్స్ రాబోయే చిత్రం జూనియర్. ఈ చిత్రం కన్నడ భాషలో రూపుదిద్దుకుంటోంది. అలాగే తెలుగులోనూ విడుదల కాబోతోంది. బైలింగ్వుల్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 18నే ఈ చిత్రం విడుదల కాబోతుండటంతో సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదల చేసిన 'వైరల్ వయ్యారి' సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. య్యూటూబ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ సాంగ్ లో ముఖ్యంగా శ్రీలీలా మాస్ స్టెప్పులకు ఫ్యాన్స్, ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.

Sreeleela Remuneration to Junior Movie

జూనియర్ సినిమా వివరాలు..
జూనియర్ చిత్రాన్ని కన్నడ, తెలుగు భాషల్లో రూపొందించారు. కిరిటీ రెడ్డి - శ్రీలీలా జంటగా నటించిన చిత్రమిది. ఈ చిత్రానికి రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కొర్రపాటి ప్రొడక్షన్ లో రూపుదిద్దుకుంది. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడం విశేషం. ఇక రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతం అందించారు. ఈ చిత్రంలోని కీలక పాత్రతో స్టార్ హీరోయిన్ జెనీలియా తిరిగి టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తోంది. తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. అలాగే రవిచంద్రన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.

శ్రీలీలా పారితోషికం..
టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలాకు ఇటీవల హిట్స్ పెద్దగా లేవు. భగవంత్ కేసరి, గుంటూరు కారం తర్వాత వరుసగా ఫ్లాప్స్ పడుతూనే వస్తున్నాయి. అంతకు ముందు చిత్రాలు కూడా పెద్దగా సక్సెస్ సాధించలేదు. చివరిగా వచ్చిన రాబిన్ హుడ్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో శ్రీలీలా పారితోషికం కూడా తగ్గినట్టు తెలుస్తోంది. గుంటూరు కారం చిత్రానికి రూ.4 కోట్లు తీసుకున్న ఈ బ్యూటీ, జూనియర్ చిత్రానికి కేవలం రూ.2.5కోట్లు మాత్రమే ఛార్జీ చేసిందంట. మరోవైపు శ్రీలీలా హిందీ డెబ్యూ ఫిల్మ్ కు రూ.7 కోట్లు డిమాండ్ చేసినా అక్కడ తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క సాలిడ్ హిట్ పడితే మాత్రం శ్రీలీలా రెమ్యునరేషన్ అమాంతం పెరిగిపోతుందని అంటున్నారు.

శ్రీలీలా రాబోయే చిత్రాలు..
జూలై 18తో జూనియర్ చిత్రంలో అలరించబోతోంది శ్రీలీలా. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రవితేజతో మాస్ జాతర అనే చిత్రంలో నటిస్తోంది. హిందీలో ఆషికీ 3 చిత్రంలోనూ నటిస్తోంది. మరో హిందీ ప్రాజెక్ట్ కు కూడా సైన్ చేసింది.

More from Filmibeat

Read more about: sreeleela junior remuneration
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X