తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్? హీరోయిన్ తల్లి స్ట్రాంగ్ రియాక్షన్

భారత్‌లో క్రికెటర్లకు, సినీతారలకు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందరో ముద్దుగుమ్మలు క్రికెటర్లతో ఎఫైర్లు సాగించిన వారే. వీరిలో కొందరు వైవాహిక బంధంతో ఒక్కటవ్వగా.. చాలావరకు పెళ్లి పీటల వరకు రాకుండా డేటింగ్‌తోనే ముగిసిపోయాయి. ఇప్పటికీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హీరోయిన్లు- క్రికెటర్ల ప్రేమాయణాలు వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలతో టీమిండియా స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్ చేస్తున్నాడంటూ వచ్చిన వార్తలతో సినీ, క్రికెట్ వర్గాలు షాకయ్యాయి. తాజాగా దీనిపై శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

కన్నడంలో ఒకటి రెండు సినిమాలు చేసి పెళ్లి సందD అనే మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు శ్రీలీల. తన క్యూట్ లుక్స్, అందం, డ్యాన్సింగ్ చిన్న వయసులోనే స్టార్‌డమ్ అందుకున్నారు శ్రీలీల. అలాగే పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ వంటి సూపర్‌స్టార్స్‌‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం ధనుష్ సరసన హీరోయిన్‌గా తమిళంలో మరో ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. బాలీవుడ్‌లో అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు శ్రీలీల. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

Sreeleela s Mother Reacts To Dating Rumours With Cricketer Tilak Varma

డాక్టర్ కావాలన్నది తన కల అని పలుమార్లు తెలిపిన శ్రీలీల.. షూటింగ్స్‌లో పాల్గొంటూనే చదువుకున్నారు. ఆమె కష్టం ఫలించి ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ పట్టా అందుకున్నారు. తన ప్రయాణం ఇక్కడితో ఆగదని ఇంకా చదువుకుంటానని శ్రీలీల పలుమార్లు వెల్లడించారు. చాలామంది హీరోయిన్లపై రూమర్స్ వచ్చినట్లుగానే శ్రీలీలపైనా ఎన్నోసార్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం సాగిస్తున్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లాడబోతున్నట్లుగా గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ తర్వాత ఇవి గాలివార్తలేనని తేలిపోయింది.

అయితే తాజాగా తెలుగు తేజం, టీమిండియా క్రికెటర్ తిలక్‌ వర్మతో శ్రీలీల డేటింగ్ చేస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబైలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు శ్రీలీల హాజరుకావడం.. గతేడాది డిసెంబర్‌లో శ్రీలీల- తిలక్ వర్మలు ఒకేసారి తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఈ పరిణామాలతో శ్రీలీల అభిమానులు షాకయ్యారు. ఈ రూమర్స్‌పై శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత స్పందించారు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు పూర్తిగా నిరాధారం. వీటిలో ఎలాంటి నిజం లేదు. శ్రీలీల ప్రస్తుతం తన చదువు, నటనలోనే బిజీగా ఉంది. షూటింగ్స్‌కు ఏమాత్రం గ్యాప్ దొరికినా నీట్- పీజీ ఎగ్జామ్‌కు ప్రీపేర్ అవుతున్నారు. శ్రీలీల పెళ్లి, ఇతర వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించడానికి ఇంకా చాలా టైం ఉంది. ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌కి శ్రీలీల వెళ్లడం, 2025 డిసెంబర్‌లో శ్రీలీల - తిలక్‌లు తిరుమలకు వెళ్లడం ఉద్దేశ్యపూర్వకంగా జరిగినవి కావు. వీటి ఆధారంగా ఇష్టానుసారం కథల్ని అల్లుకుపోవొద్దని డాక్టర్ స్వర్ణలత క్లారిటీ ఇచ్చారు. ఆమె స్పందనతోనైనా శ్రీలీల - తిలక్ వర్మలపై వస్తున్న వార్తలకు చెక్ పడుతుందేమో చూడాలి.

Read more about: sreeleela tilak varma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X