నా శరీరం సహకరించకున్నా ఆ పని చేశా.. సాకులు చెప్పలేదు.. శ్రీలీల

అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, టాలెంట్‌తో తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. 'పెళ్లి సందడి'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించింది. డ్యాన్స్, క్యూట్‌నెస్‌తో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ, కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో కొంతకాలం అవకాశాలు తగ్గాయి. అయితే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరోయిన్ పీరియడ్స్‌పై బోల్డ్‌గా కామెంట్స్ చేసింది. దీంతో ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఏమన్నారంటే?

శ్రీలీలకు 'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఈ సినిమా హిట్ తో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్టి సొంతం చేసుకుంది. అనంతరం పలువురు అగ్రహీరోల సరసన వరుసగా సినిమాలు చేసే అవకాశం అందుకుంది. కేవలం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ శ్రీలీల ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది.

Sreeleela Says She Worked Through Period Pain Sparks Debate on Women s Strength

ఇటీవల పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ ఆమెకు అవకాశాల వరద మాత్రం తగ్గలేదు. కోలీవుడ్‌లో ధనుష్తో పాటు బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో కూడా నటిస్తోంది.ఇటీవల శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సమయంలో ఆమెను అక్కడున్న మహిళలు పీరియడ్స్ సమయంలో షూటింగ్ ఎలా నిర్వహిస్తారు? ఇబ్బందులు ఎదురవుతాయా? అని ప్రశ్నించగా, శ్రీలీల మాట్లాడుతూ, "నేను ఇప్పటివరకు చాలా పాటలకు డ్యాన్స్ చేశాను. అందులో హిట్ అయిన సాంగ్స్ ఎక్కువగా పీరియడ్స్ సమయంలోనే షూట్ అయ్యాయి. ఆ పాటలకే నాకు ఎక్కువ ప్రశంసలు వచ్చాయి. అందుకే పీరియడ్స్ అనేది ఒక మహిళకు సాకుగా ఉండకూడదనేది నా అభిప్రాయం" అని పేర్కొంది. 'మహిళలుగా మనం సమాన హక్కులు, అవకాశాలు కోరుకుంటున్నప్పుడు శారీరక, మానసిక ఇబ్బందులను అధిగమించే ధైర్యం కూడా ఉండాలి.

పీరియడ్స్‌ను కారణంగా చూపించి వెనక్కు తగ్గకుండా, మనల్ని మనం ముందుకు నెట్టుకోవాలి'అని తెలిపింది. ఈ వ్యాఖ్యలతో మహిళలకు ధైర్యం చెప్పాలన్నదే తన ఉద్దేశమని అర్థమవుతోంది. శ్రీలీల మాటలకు సోషల్ మీడియాలో విస్తృతంగా స్పందనలు వస్తున్నాయి. చాలామంది ఆమె మాటలను ప్రశంసిస్తూ, "ఇది నిజమైన మోటివేషన్" అంటూ అభినందిస్తున్నారు. మహిళలు కష్టాల్ని దాటుకుని ముందుకు వెళ్లాలని చెప్పడం స్ఫూర్తిదాయకమని కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరూ అయితే.. ప్రతి మహిళకు పీరియడ్స్ సమయంలో పరిస్థితులు ఒకేలా ఉండవని, కొందరికి తీవ్రమైన నొప్పులు, ఆరోగ్య సమస్యలు ఉంటాయని గుర్తుచేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో దాన్ని 'సాకుగా' చూడటం సరైన దృక్కోణం కాదని విమర్శిస్తున్నారు.

ఇక శ్రీలీల వైద్య విద్య అభ్యసించిన విషయం కూడా ఈ చర్చలో కీలకంగా మారింది. ఒక డాక్టర్‌గా ఆమెకు మహిళల ఆరోగ్య సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, ఇలాంటి సున్నితమైన అంశంపై మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి యంగ్ హీరోయిన్ శ్రీలీల చేసిన సున్నిత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.

Read more about: pawan kalyan sreeleela bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X