Sreeleela: గాయంతో ఫోటో షేర్ చేసిన శ్రీలీల.. కంగారులో ఫ్యాన్స్!
ఒక్క తెలుగు సినిమాలోనే కాకుండా టోటల్ సౌత్ ఇండియా సినిమా దగ్గర కూడా అతి చిన్న వయస్సులోనే సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యి.. అలా ఎంటర్ అయ్యిన కొన్ని సినిమాలతోనే భారీ పాపులార్టీ తెచ్చుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కాగా ఇలా నార్త్ నుంచి వచ్చిన బ్యూటీస్ సౌత్ సినిమా దగ్గర చాలా మందే రూల్ చేశారు. కానీ మన సౌత్ నుంచి ఈ తరహాలో అయితే చాలా తక్కువ మందే కనిపిస్తారు.
ఈ కొంచెం మందిలో కూడా తెలుగు హీరోయిన్ వచ్చి సౌత్ సినిమాని రూల్ చేసింది. మరి ఆ యువ హీరోయిన్ నే శ్రీ సినిమా తోనే అందరి దృష్టిని తనవైపు లాక్కుంది. ఇక్కడ నుంచి టాలీవుడ్ లో ఒక్కసారిగా మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిపోయిన శ్రీలీల ఇప్పుడు అదే జోరుని కొనసాగిస్తుంది. కాగా ఈమెకి ఎన్ని వరుస ఆఫర్స్ వచ్చాయో అదే విధంగా అన్ని ప్లాప్ లు కూడా వచ్చాయి.

అయినప్పటికీ శ్రీలీలకి ఆఫర్స్ మాత్రం సౌత్ నుంచి నార్త్ వరకు వస్తున్నాయి. అయితే ఇంత స్టార్డం పెట్టుకున్న శ్రీలీల లేటెస్ట్ గా ఓ గాయంతో కనిపించి షాకిచ్చింది. తన ముఖం మీద రక్తపు గాయాన్ని సోషల్ మీడియాలో చూపించి తన అభిమానులకి ఒక్క నిమిషం జలక్ ఇచ్చింది. ఐతే ఇది నిజంగా శ్రీలీలకి జరిగిన గాయం కాదు. ఓ సినిమాలో ఆమెకి అలా మేకప్ వెయ్యడం జరిగింది.
అయితే ఇది పెట్టడానికి గల కారణం ఏమిటంటే తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో చేసిన చిట్ చాట్ లో ఆమెకి ఒక ప్రశ్న ఎదురైంది. ఇప్పుడు వరకు శ్రీలీల చేసిన సినిమాల్లో తనకి ఎంతో ఇష్టమైన పాత్ర ఏది అంటే దానికి సమాధానంగా ఆ రక్తంతో ఉన్న పిక్ ని పెట్టి గెస్ చెయ్యండి అంటూ ఆన్సర్ ఇచ్చింది. దీనితో మొదట ఒక్కసారిగా ఆ ఫోటో చూసి ఫాలోవర్స్ టెన్షన్ పడ్డారు..

కానీ అది ఓ సినిమా లోనిది అని తర్వాత తేరుకున్నారు. ఇంతకీ శ్రీలీలకి అయ్యిన సినిమా, రోల్, ఆమె పోస్ట్ చేసిన పిక్ సినిమాలోనివి అంటే.. తాను హీరోయిన్ గా నటించని సినిమాని ఎంచుకుంది. కాగా శ్రీలీల హీరోయిన్ గా చేయని ఆ ఏంటంటే సీనియర్ హీరో బాలయ్యతో తనకి కూతురుగా కనిపించిన సినిమా "భగవంత్ కేసరి" లోని అన్నట్టు రివీల్ చేసింది.
కాగా అందులో కనిపించే ఇన్నోసెంట్ లుక్ లో ఫోటోనే శ్రీలీల షేర్ చేసుకొని తన ఫేవరెట్ రోల్ ఇది అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం శ్రీలీల తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే నితిన్, రవితేజ లాంటి స్టార్స్ తో రెండోసారి నటిస్తుంది. అలాగే రీసెంట్ గానే కోలీవుడ్ లో కూడా ఓ బడా ఆఫర్ నే సొంతం చేసుకున్నట్టుగా కూడా రూమర్స్ వచ్చాయి. మరి చూడాలి శ్రీలీల లక్ మారుతుందో లేదో అనేది.


Click it and Unblock the Notifications











