Sreeleela దేవతావతారంలో మెరిసిన శ్రీలీల.. క్లాసికల్ డ్యాన్స్‌తో అదరగొట్టిన అందాల భామ!
తెలుగు సినిమా పరిశ్రమలో రాకెట్‌లా దూసుకొచ్చిన యువ హీరోయిన్ శ్రీలీల తన ప్రతిభతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకొన్నది. పెళ్లి సందD మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ యువ నటి కొద్దికాలంలోనే బాలకృష్ణ, మహేష్ బాబు, రవితేజ లాంటి హీరోలతో జతకట్టింది. అయితే ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకొన్నాయి. అయితే ఆమె ఇటీవల చేసిన క్లాసికల్ నృత్యం అందర్నీ ఆకట్టుకొన్నది. ఆ డ్యాన్స్ షో వివరాల్లోకి వెళితే..

శ్రీలీల కేవలం నటిగానే కాకుండా పలు విషయాల్లో టాలెంట్ నిరూపించుకొంటున్నారు. ఎంబీబీఎస్ చదువుతూనే ఆమె సినిమాల్లోనే కాకుండా నృత్య రంగానికి సేవలు అందిస్తున్నారు. ఆమె క్లాసికల్, వెస్ట్రన్ డ్యాన్స్‌లో ప్రావీణ్యత సాధించారు.

సమతా కుంభ్ 2024 సంబంధించిన వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో శ్రీలీల భాగమయ్యారు. ఈ సందర్భంగా నృత్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శనలో గోదా దేవీగా కనిపించారు. అద్బుతమైన వస్త్రాలంకరణ అందర్నీ ఆకట్టుకొన్నది. ఈ నృత్య ప్రదర్శన గోదా దేవీగా ఆమె ప్రదర్శించిన హవభావాలు అందర్నీ కొత్త అనుభూతికి గురి చేశాయి. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియోపై మీరు ఓ లుక్ వేయండి..



Click it and Unblock the Notifications











