Sreeleela: అపరిచితుడితో శ్రీలీల డ్యాన్స్‌.. స్టెప్పులతో దమ్ముదులిపేసిందిగా (వీడియో)

Sreeleela: తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో ఎనలేని పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీల. ఇటీవల అల్లు అర్జున్- సుకుమార్ కాంబో తెరకెక్కిన పుష్ప 2 సినిమాలో దుమ్మురేపింది. 'కిస్సిక్'సాంగ్ పై మాస్ స్టెప్పులు వేసి ఓవర్ నైట్ స్టార్ మారింది. దీంతో నేషనల్ వైడ్ గా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఈ ఐటెం సాంగ్ లో ఈ అమ్మడు కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. బాలీవుడ్ నుంచి ఆఫర్స్ అందుకుంటుంది. ఇలా ఇండస్ట్రీలో సెన్సెషన్ గా మారిన హీరోయిన్ శ్రీలీలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటో ఆ వీడియో లూక్కేయండి..

కన్నడ సుందరి శ్రీలీల గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. హీరో శ్రీకాంత్ తనయుడు రోహిత్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఏంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో టాలీవుడ్ పేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సినిమా హిట్ కావడంతో మాస్ మహారాజా రవితేజతో 'ధమాకా' సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది శ్రీలీల. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ ఫేమ్ తో నందమూరి బాలకృష్ణ 'భగవాన్ కేసరి'లో ప్రధాన పాత్రలో నటించే అవకాశాన్ని కొట్టేసింది శ్రీలీల. ఈ సినిమాలో ఈ అమ్మడు నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి.

Sreeleela Superb Dance With Her Home Watchman dance Video viral

ఆ తర్వాత 'గుంటూరు కారం'లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఇటీవల పుష్ప 2లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన స్పెషల్ సాంగ్ లో మాస్ స్టెప్పులు వేసింది ఈ అమ్మడు. అల్లు అర్జున్, శ్రీ లీల మాస్ స్టెప్పులకు థియేటర్ దద్దరిల్లిపోయాంటే.. అతిశయోక్తి కాదు. పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం శ్రీలీల దాదాపు రెండు కోట్లు తీసుకుందట. అంతేకాదు.. కిస్సిక్ ఐటెం సాంగ్ తో ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో మారుమోగుతోంది.

ఇక శ్రీలీల అప్ కమ్మింగ్ సినిమాల విషయానికి వస్తే.. హీరో నితిన్‌తో 'రాబిన్ హుడ్' అనే సినిమా మార్చి 28న విడుదల కాబోతుంది. అలాగే.. రవితేజ సరసన మరోసారి 'మాస్ జాతర'అనే సినిమాలో శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమా కూడా త్వరలోనే విడుదల కాబోతుంది. తమిళంలో శివ కార్తికేయన్ 'పరాశక్తి'లో కూడా శ్రీలీల నటిస్తుంది. అంతే కాకుండా.. పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'అనే సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసింది.

అలాగే.. బాలీవుడ్‌లో కూడా శ్రీలీల తన ప్రయాణాన్ని మొదలుకాబోతోంది. ఓ హిందీ మూవీలో నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. కానీ, అధికారక ప్రకటన రాలేదు. ఇలా వరుస సినిమాతో బిజీబిజీగా ఉంటే శ్రీలీల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఓ అపరిచిత వ్యక్తితో ఆమె చేసిన డ్యాన్స్‌ వీడియో వైరల్ గా మారింది. శ్రీలీల నటి మాత్రమే కాదు, మంచి డాన్సర్ కూడా.. స్టార్ హీరోలతో సమానంగా డాన్స్ చేయగల సత్తా తనకుంది. అలాంటి స్టార్ హీరోయిన్ శ్రీలీల ఒక సామాన్య వ్యక్తితో కలిసి సెప్పులేసింది. తన ఇంటి వాచ్ ‌మ్యాన్‌తో కలసి మాస్ స్టెప్పులు వేసింది ఈ అమ్మడు. ఆ వీడియోను శ్రీలీల సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

More from Filmibeat

Read more about: sreeleela pushpa 2 allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X