ఓ వైపు మహేష్ మరోవైపు ప్రభాస్.. ఈ బ్యూటీ లక్కు మామూలుగా లేదు?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొంత కాలంగా కొత్త హీరోయిన్స్ కోసం స్టార్ హీరోలు చాలానే వెతుకుతున్నారు. కొందరు హీరోలు ఒకసారి నటించిన హీరోయిన్స్ తో మరోసారి సినిమా చేసేందుకు చాలావరకు ఆసక్తి చూపించడం లేదు. దర్శకులు నిర్మాతలు కూడా సరికొత్త కాంబినేషన్స్ ను వెండితెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆడియన్స్ అభిరుచులు కూడా ప్రతివారం చాలానే మారిపోతున్నాయి. ఒకప్పుడు కాంబినేషన్ అంటే హీరో హీరోయిన్ పైనే ఎక్కువగా అంచనాలు క్రియేట్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ అంచనాలు డైరెక్టర్ హీరోలపై పెరుగుతున్నాయి.

ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ హవా తగ్గడంతో కొత్త హీరోయిన్స్ ఏ మాత్రం సక్సెస్ అందుకున్న కూడా ఈజీగా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటున్నారు. ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కృతి శెట్టి కూడా వరుసగా పెద్ద సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ పారితోషకం కూడా కోటిన్నరకు పైగా పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో మరొక హీరోయిన్ పేరు కూడా హాట్ టాపిక్ గా మారుతోంది.

Sreeleela talks for mahesh babu and prabhas upcoming projects

ఆమె మరెవరో కాదు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లిసందడి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ శ్రీ లీల. కన్నడ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈ మెడికల్ స్టూడెంట్ ఇటీవల తన గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసేసింది. ఇక వరుసగా సినిమాలతో బిజీ అయ్యేందుకు చర్చలు జరుపుతోంది. పెళ్లి సందడి సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు ఈ బ్యూటీ అందంగా ఉండటంతో స్టార్ హీరోలకు సరైన జోడీ అని దర్శకులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ధమాకా సినిమా లో మాస్ మహారాజా రవితేజతో సినిమా చేయడానికి ఒప్పుకుంది ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి వచ్చిన విషయం తెలిసిందే..

అలాగే ప్రభాస్ హీరోగా చేస్తున్న మరొక సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్ గా ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. రాజా డీలక్స్ అనే ఆ సినిమా లో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ తో రొమాన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక హీరోయిన్ ఫైనల్ చేసిన దర్శకుడు మరొక హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీలను అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ హీరో తో సినిమా అంటే తప్పకుండా ఈ స్క్రిప్ట్ వినకుండానే ప్రాజెక్టు ఓకే చేస్తుంది అని చెప్పవచ్చు.

అలాగే మరో వైపు మహేష్ బాబు తో కూడా శ్రీలీల మరొక సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.. మహేష్ సర్కారు వారి పాట సినిమా అనంతరం త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. త్రివిక్రమ్ మళ్ళీ ఎప్పటిలానే ఇద్దరు హీరోయిన్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు గా టాక్ అయితే గట్టిగానే వినిపించింది. ఇక మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ఫైనల్ అవ్వగా మరొక హీరోయిన్ కోసం త్రివిక్రమ్ శ్రీలీలను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఆ విషయంపై అఫీషియల్ గా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. మహేష్ ప్రభాస్ సినిమాలో ఈ బ్యూటీకి నిజంగానే అవకాశం దొరికితే ఈజీగా స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతుంది అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X