దేవర విలన్ కొడుకుతో శ్రీలీల రొమాన్స్? మొత్తానికి నార్త్ ఎంట్రీకి మళ్ళీ
ఇప్పుడు సౌత్ ల మోస్ట్ బిజీగా ఉన్న హీరోయిన్స్ కొందరు ఉంటే వారి అందరిలో కంటే కెరీర్ స్టార్ట్ చేసిన కొన్నేళ్ల లోనే పీక్ బిజీగా మారిపోయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే తెలుగు బ్యూటీ శ్రీలీల అనే చెప్పాలి. కాగా శ్రీలీల హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్లలోనే ఒక్క తెలుగులోనే కాకుండా ఏకంగా ఇండియా వైడ్ అత్యధిక సినిమాలు చేస్తున్న బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఇంకా ఆమె చేస్తున్నానని సినిాలు అది కూడా ఏకకాలంలో ఏ హీరోయిన్ కూడా ప్రెజెంట్ జెనరేషన్ లో లేకపోవడం గమనార్హం. అలా కెరీర్ స్టార్టింగ్ లోనే పీక్ డిమాండ్ ని శ్రీలీల చూడగా రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో కిస్సిక్ అనే హాట్ ఐటెం సాంగ్ లో కనిపించి పాన్ ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ ని కూడా తెచ్చుకోగలిగింది.

అయితే శ్రీలీలకి ఒక్క తెలుగు నుంచే కాకుండా హిందీ సినిమాలో కూడా ఎంట్రీ ఇ్తుంది అని ఆ మధ్య పలు రూమర్స్ వచ్చాయి. తాను మాత్రమే కాకుండా మరో బ్యూటీ మృణాల్ ఠాకూర్ తో కలిసి ఆమె బాలీవుడ్ సినిమాలో కనిపిస్తుంది అని పలు గాసిప్స్ వచ్చాయి. కానీ అనుకోని విధంగా శ్రీలీల ఎంట్రీకి ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఆ సినిమా మొదలు కాకుండానే ఆగిపోయింది.
దీనితో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి బ్రేకులు పడ్డాయి కానీ ఇపుడు మళ్ళీ తన ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇపడు బాలీవుడ్ లో ఓ సినిమా కోసం చర్చల్లో తాను బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఆమె అక్కడ యువ హీరో ఇబ్రహీం అలీ ఖాన్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ యువ హీరో ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ నటుడు అలాగే రీసెంట్ గా తెలుగులో "దేవర"తో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన నటుడు సైఫ్ అలీ ఖాన్ వారసుడు అట.

తన డెబ్యూ కోసం శ్రీలీలతో బాలీవుడ్ మేకర్స్ చర్చలు కొనసాగిస్తున్నారు. లేటెస్ట్ ా ముంబైలో కూడా ఆమె కనిపించిన విజువల్స్ వైరల్ గా మారాయి. కాగా ఈ కాంబినేషన్ లో శ్రీలీల దాదాపు ఖరారు అన్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి బాలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ అయిపోయినట్టే అని చెప్పవచ్చు.
ఇక ఇవి పక్కన పెడితే శ్రీలీల తెలుగులో ప్రస్తుతం నితిన్ సరసన రెండో సారి రాబిన్ హుడ్, మాస్ మహారాజ రవితేజ సరసన కూడా రెండో సారి "మాస్ జాతర" సినిమాలు చేస్తుండగా ఇవి కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "ఉస్తాద్ భగత్ సింగ్" అనే సినిమాలు కూడా చేస్తుంది. అలాగే తమిళ్ లో కూడా ఓ సినిమాలో నటిస్తుంది.


Click it and Unblock the Notifications











