Sreeleela: టాప్ కమెడియన్ కు శ్రీలీల వార్నింగ్!
Sreeleela: టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో ఎనలేని పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీల. ఇటీవల అల్లు అర్జున్- సుకుమార్ కాంబో మూవీ పుష్ప 2 'కిస్సిక్' సాంగ్ పై మాస్ స్టెప్పులు వేసి ఓవర్ నైట్ నేషనల్ వైడ్ గా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఈ స్పెషల్ సాంగ్ తో ఈ అమ్మడు కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయంట. ఇలా ఇండస్ట్రీలో సెన్సెషన్ గా మారిన శ్రీలీలకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఓ టాప్ కమెడియన్ కు శ్రీలీల వార్నింగ్ ఇస్తోంది. ఆ సంగతేంటో మీరు కూడా ఓ లూక్కేయండి..
కన్నడ సుందరి శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది తన అందం, ఆ తరువాత తన డ్యాన్స్. తన అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. ముఖ్యంగా హీరోయిన్ కుర్ర కారుకు హాట్ ఫేవరేట్ గా మారిపోయింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రాళ్ల మతిపోగోడుతోంది. ఈ అమ్మడు హీరో శ్రీకాంత్ తనయుడు రోహిత్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఏంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో టాలీవుడ్ పేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

ఆ తరువాత మాస్ మహారాజా రవితేజ తో 'ధమాకా'లో నటించే అవకాశాన్ని కొట్టేసింది శ్రీలీల. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా ఈ అమ్మడు నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ 'భగవాన్ కేసరి'లో ప్రధాన పాత్రలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ సినిమాలో శ్రీలీల నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి. ఆ తర్వాత 'గుంటూరు కారం' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే లక్కీ చాన్సును అందుకుంది. ఇందులో తన మాస్ స్టెప్పులతో అదరగొట్టింది.
ఇటీవల పుష్ప 2లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన స్పెషల్ సాంగ్ లో మాస్ స్టెప్పులు వేసింది ఈ అమ్మడు. అల్లు అర్జున్, శ్రీ లీల మాస్ స్టెప్పులకు థియేటర్ దద్దరిల్లిపోయాంటే.. అతిశయోక్తి కాదు. పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం శ్రీలీల దాదాపు రెండు కోట్లు తీసుకుందట. అంతేకాదు.. కిస్సిక్ ఐటెం సాంగ్ తో ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. అయితే తాజాగా శ్రీ లీల సీనియర్ నటుడు కమెడియన్ బ్రహ్మాజీకి వార్నింగ్ ఇచ్చిన వీడియో నెట్ లో వైరల్ అవుతుంది.
అయితే ఇది సీరియస్ గా ఇచ్చిన వార్నింగ్ కాదు. శ్రీ లీల సినిమాలలోని కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ హాట్ ఫోటోలు వీడియోలతో తన అభిమానులకు చేరువలోనే ఉంటుంది. ఈ క్రమంలోనే నటుడు బ్రహ్మాజీతో కలిసి 'దెబ్బలు పడతాయిరో' అనే సాంగ్ మీద శ్రీ లీల రీల్ చేశారు. ఇందులో బ్రహ్మాజీ కూర్చొని వీడియో తీస్తుండగా.. శ్రీ లీల తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో.. దెబ్బలు పడతాయిరో అంటూ బ్రహ్మాజీకి వార్నింగ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది


Click it and Unblock the Notifications











