Guntur Kaaram ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టిన శ్రీలీల.. గుంటూరు కారంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా

తెలుగు సినిమా పరిశ్రమలో రాకెట్‌లా దూసుకొచ్చిన అందాల తార శ్రీలీల వరుస సినిమాలతో మాత్రమే కాకుండా స్టార్ హీరోల పక్కన నటిస్తూ అందంతోనే కాకుండా అభినయంతో కూడా మెప్పిస్తున్నది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన పెళ్లి సందడి (Pelli SandaD) తెలుగు ప్రేక్షకుల హృదయాలకు చేరువైన ఈ బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్‌లో సెన్సేషనల్ స్టార్‌గా మారింది. శ్రీలీల తాజాగా గంటూరు కారం సినిమాలో మహేష్ బాబుతో జతకట్టి మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకొన్నది. ఇలా దూసుకెళ్తున్న శ్రీలీల గురించిన ప్రతిభా వివరాల్లోకి వెళ్లితే..

పెళ్లిసందడితో అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీలీల ఆ తర్వాత రవితేజతో కలిసి ధమాకా చిత్రంలో నటించింది. ఈ సినిమాలో మాస్ పాటలకు చేసిన ఆమె డ్యాన్సులు, వేసిన స్టెప్పులు కిరాక్ అనేలా ఉన్నాయి. దాంతో ఆ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడటమే కాకుండా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రాబట్టేలా చేసింది. ఆ తర్వాత ఆమె ఆఫర్లు భారీగా వచ్చి పడ్డాయి. నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి చిత్రంలోను, రామ్ పోతినేనితో స్కంధ, వైష్ణవ్ తేజ్‌తో కలిసి ఆదికేశవ చిత్రాల్లో నటించింది.

 Sreeleela Wow Moments, Hi Energy steps in Mahesh Babus Guntur Kaaram goes Talk of The Industry

అయితే ఇప్పటి వరకు శ్రీలీల నటించిన సినిమాల్లో నటన పరంగానే కాకుండా ఆమె వేస్తున్న డ్యాన్సులు ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించేలా చేస్తున్నది. దాంతో ఆమెను దృష్టిలో పెట్టుకొని స్పెషల్‌గా రోల్స్ డిజైన్ చేయడంలో దర్శకులు నిమగ్నమయ్యారు. అంతేకాకుండా స్టార్ హీరోలు సినిమాల్లో ఆమెకు భారీ ఆఫర్లు ఇస్తున్నారు.

 Sreeleela Wow Moments, Hi Energy steps in Mahesh Babus Guntur Kaaram goes Talk of The Industry

తాజాగా గుంటూరు కారం చిత్రంలో శ్రీలీల అముక్త మాల్యద అలియాస్ అమ్ము క్యారెక్టర్‌లో ఆమె ప్రదర్శించిన అందచందాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అంతేకాకుండా ఒక్కడు సినిమాలోని చెప్పవే చిరుగాలి.. అలాగే పలాస సినిమాలోని నాది నక్లెస్ గొలుసు పాటలో మహేష్ బాబుతో వేసిన ఊరమాస్ స్టెప్పులకు ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు. ఆమె ఎనర్జీ, స్టేల్‌ చూస్తే మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అనేలా చేసింది.

గుంటూరు కారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆమెతో డ్యాన్స్ చేయడం, ఎనర్జీని మ్యాచ్ చేయడం గురించి మహేష్ పొగడ్తల వర్షం కరెక్ట్ అనిపించేలా చేసింది. ఈ సినిమాలో కుర్చి మడత పెట్టి పాటలో మహేష్‌తో పోటాపోటీగా శ్రీలీ చేసిన డ్యాన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దాంతో శ్రీలీల మాస్ స్టెప్పులను చూసేందుకు ప్రేక్షకులు, అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు.

 Sreeleela Wow Moments, Hi Energy steps in Mahesh Babus Guntur Kaaram goes Talk of The Industry

ప్రస్తుతం శ్రీలీల కెరీర్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నది. అలాగే పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్, ఆ తర్వాత అనగనగ ఒక రాజు చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆమె ఎంబీబీఎస్ కూడా చదువుతూ పరీక్షలకు హాజరవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X