ఉస్తాద్ భగత్ సింగ్ పాటకు శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులు.. దేఖ్‌లేంగే సాలా అంటూ వయ్యారంగా (Video)!
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో యువ హీరోయిన్ శ్రీలీల కేవలం యాక్టింగ్‌తోనే కాకుండా తన డ్యాన్స్ ప్రతిభతో దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించారు. ఈ మధ్యకాలంలో ఆమె చేసిన డ్యాన్స్, ఆమె నటించిన పాటలు వైరల్ అయ్యాయి. సినిమాను సక్సెస్ బాట పట్టించేంతగా ఆమె నృత్య ప్రతిభ ప్రేక్షకులను రంజింప చేసింది. అయితే కొన్ని ఈవెంట్లలో ఆమె చేసిన డ్యాన్స్ స్టెప్పులు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ప్రైవేట్ కమర్షియల్ ఈవెంట్‌లో శ్రీలీల చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నది. ఆమె డ్యాన్స్ వీడియోను మీరే చూడండి..
శ్రీలీల ఇటీవల కాలంలో నటించిన సినిమాలు పెద్దగా ప్రజాదరణ పొందడం లేదు. కానీ ఆమె కనిపించిన పాటలు మాత్రం యూత్‌ను ఆకట్టుకొంటున్నాయి. ఫాస్ట్‌గా ఆమె వేసే స్టెప్పులు యువతను హుషారెత్తిస్తున్న సంగతి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి ఆమె నటిస్తున్నారు. ఈ సినిమాలో దేఖ్ లేంగే సాలే అనే పాట విడుదల చేయగా ఫుల్లుగా పాపులర్ అయింది.

ప్రస్తుతం శ్రీలీల తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటిస్తూ మంచి డిమాండ్‌తో దూసుకెళ్తున్నది. యాక్టింగ్ మాత్రేమే కాకుండా ఆమె కమర్షియల్ ఈవెంట్స్‌లో కూడా భారీగా పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోని పవర్ స్టార్ వేసిన క్రేజీ స్టెప్పును ఆమె అనుకరించింది. దేఖ్ లేంగే సాలా అనే పాటపై తన అభిమానుల ముందు ఊగిపోయింది. ఫ్యాన్స్‌ను హుషారెత్తిస్తూ వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
శ్రీలీల చేసిన డ్యాన్స్ వీడియోను పవర్ స్టార్ అభిమానులు షేర్ చేయడంతో ఆ పాట మరోసారి క్రేజీగా మారింది. ఈ పాటలో హీరోయిన్ గ్రేస్, లుక్ అదిరిపోయాయి అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇన్స్‌టాగ్రామ్, ట్విట్టర్‌లో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతున్నది. దాంతో ఈ సినిమాలోని పాటను ఎప్పుడెప్పుడూ చూద్దామా? అనే ఫీలింగ్‌ను ఆమె క్రియేట్ చేశారని అంటున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతోపాటు శ్రీలీల ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. హిందీలో ఆషికీ 3తోపాటు, తమిళంలో ధనుష్, సాయిపల్లవితో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇంకా తెలుగులో భారీ ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. ఆమె నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చిలో విడుదలకు సిద్దంగా ఉంది.


Click it and Unblock the Notifications











