మీ పెళ్లాం అనుకొంటున్నారా? శ్రీలీల కామెంట్స్ వైరల్
యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'పెళ్లి సందడి'తో టాలీవుడ్‌లో అడుగుపెట్టి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ హిట్స్ కంటే ఫ్లాపులు ఎక్కువ కావడంతో కొంత గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ఆ బ్రేక్‌కు ముగింపు పలుకుతూ మళ్లీ సినిమాలతో బిజీ అవుతోంది.ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. ఓ ఈవెంట్ లో శ్రీలీల చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల మరోసారి తన కూల్ నేచర్‌తో నెటిజన్లను ఆకట్టుకున్నారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో ఇటీవల నిర్వహించిన 'జూబిలేషన్' ఫెస్ట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలేజ్ ఫెస్ట్‌లో భాగంగా శ్రీలీల విద్యార్థులతో మాట్లాడింది. తన స్పీచ్‌తో వారిలో ఉత్సాహాన్ని నింపారు. చిన్నప్పుడెప్పుడో నరసరావుపేటకు వచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, మళ్లీ కాలేజ్ ఫెస్ట్‌లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఒంగోలు తన అమ్మమ్మ, తాతయ్యల ఊరని చెప్పడంతో స్టూడెంట్స్ నుంచి పెద్ద ఎత్తున చప్పట్లు వినిపించాయి. చదువుపై ఫోకస్ పెట్టాలని, జీవితంలో కష్టాలు వచ్చినా ముందుకు సాగాలని ఆమె చేసిన సూచనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా స్టేజ్‌పై మాట్లాడుతూ, "మిమ్మల్ని చూసిన జోష్‌లో అరిచి అరిచి గొంతు పోయింది" అంటూ నవ్వేశారు శ్రీలీల. అయితే అదే సమయంలో కింద ఉన్న కొందరు అబ్బాయిలు "డాన్స్... డాన్స్..." అంటూ గట్టిగా అరవడంతో, ఆమె ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా చిరునవ్వుతో స్పందించారు. 'నిజంగా పెళ్లాన్ని అడిగినట్టు అడిగారు... సరే డ్యాన్స్ చేద్దాం రండి' అంటూ చమత్కారంగా పంచ్ వేసింది. ఇలా ఆమె కామెంట్స్ తో వాతావరణం ఒక్కసారిగా ఉత్సాహంతో నిండిపోయింది. ఆ తర్వాత స్టూడెంట్స్‌తో కలిసి ఆమె స్టెప్పులు వేయడంతో ఫెస్ట్ మరింత హైలైట్ అయ్యింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీగా, పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇదే అసలైన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, స్టార్ అయినా కూడా ఎంత డౌన్ టు ఎర్త్, యూత్ క్రష్ అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం పబ్లిక్ ప్లేస్‌లో ఇలా గట్టిగా అరవడం సరికాదని, సెలబ్రిటీలతో మర్యాదగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా..శ్రీలీల మాత్రం ఈ సంఘటనను చాలా పాజిటివ్‌గా తీసుకుంది. వెంటనే తన చమత్కారంతో అక్కడి వాతావరణాన్ని లైట్ చేసింది.
ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే, 'పెళ్లి సందడి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల, తొలి సినిమాతోనే యూత్ క్రష్‌గా మారిపోయారు. ఆ తర్వాత రవితేజతో చేసిన 'ధమాకా' భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. బాలకృష్ణతో నటించిన 'భగవంతు కేసరి'లో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. మధ్యలో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, శ్రీలీలకు అవకాశాల పరంగా మాత్రం ఎలాంటి లోటు లేదు. తెలుగు, తమిళం, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో ఆమె ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











