శ్రీలీలా ఎంగేజ్ మెంట్ వార్తలు.. స్పందించిన శ్రీలీలా.. ఏమన్నదంటే?

సోషల్ మీడియాలో ఒక్కసారి టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా పేరు మారుమోగిపోయింది. ఆమె నిశ్చితార్థం చేసుకుందని అంటూ కథనాలు వరుసగట్టాయి. ఇంత ఏర్లీ ఏజ్ లో పెళ్లి పీటలకు సిద్ధమవడం ఏంటీ అంటూ అందరూ షాక్ అయ్యారు. ఎంగేజ్ మెంట్ రూమర్లు జోరుగా ప్రచారం అయ్యాయి. ఇందుకు కారణం కూడా శ్రీలీలానే.. ఆమె పంచుకున్న తాజా ఫొటోల కారణంగా ఇలాంటి రూమర్ పుట్టుకొచ్చింది. ఇక తాజాగా శ్రీలీలానే స్వయంగా ఆ రూమర్లపై స్పందించింది. మరి ఆ కార్యక్రమం ఏంటో కూడా వివరించింది. ఆ వేడుక నుంచి మరిన్ని బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

శ్రీలీలా ఎంగేజ్ మెంట్ వార్తలు..
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా తాజాగా పంచుకున్న ఫొటోలతో ఎంగేజ్ మెంట్ వార్తలు గుప్పుమన్నాయి. శ్రీలీలా పంచుకున్న ఫొటోల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం అందరినీ సందేహంలో ముంచేసింది. బిగ్ డే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంతే కాదు తన కుటుంబీకులు శ్రీలీలాకు బొట్టు పెడుతూ అక్షింతలు చల్లుతూ ఆశీర్వదించడంతో శ్రీలీలా ఎంగేజ్ మెంట్ చేసుకుందా అని అందరూ అభిప్రాయపడ్డారు. దాంతో ఆ ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి.

Sreeleela s response to the engagement rumors

స్పందించిన శ్రీలీలా..
అయితే ఎంగేజ్ మెంట్ రూమర్లపై యంగ్ హీరోయిన్ శ్రీలీలా తాజాగా స్పందించింది. మరిన్ని ఫొటోలను పంచుకుంటూ నిన్నటి ఫొటోలపై క్లారిటీని ఇచ్చింది. ఆ ఫొటోలు తన ప్రీ బర్త్ డే కు సంబంధించినవి అని తెలియజేసింది. దీంతో ఎంగేజ్ మెంట్ రూమర్లకు చెక్ పడింది. తన పుట్టిన రోజుకు ముందుగానే సంప్రదాయాల ప్రకారం తన తల్లి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ ను నిర్వహిస్తోందని చెప్పింది. తమ ఫ్యామిలీలో బర్త్ డేస్ ను ఇలా జరుపుకుంటారని తన ఫొటోల ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

శ్రీలీలా బర్త్ డే, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ..
యంగ్ బ్యూటీ శ్రీలీలా 2001లో జూన్ 14న జన్మించింది. యూనైటెడ్ స్టేట్స్ లో పుట్టి పెరిగింది. శ్రీలీలా తల్లి డాక్టర్. గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్. బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక వీరికి స్వగ్రామం ఒంగోలు. శ్రీలీలా తల్లి వ్యాపారవేత్త సుభాకర రావు ను పెళ్లి చేసుకొని విడిపోయింది. ఆ తర్వాత శ్రీలీలా జన్మించింది. ఇక చిన్నప్పటి నుంచే శ్రీలీలాకు తల్లి స్వర్ణలత యాక్టింగ్ పై ట్రెయినింగ్ ఇప్పించింది. 4 ఏళ్లకే భరతనాట్యం నేర్పించింది. 16 ఏళ్లకే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. ఇక శ్రీలీలా ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసింది.

శ్రీలీలా నెక్ట్స్ రిలీజ్ సినిమాలు..
తెలుగులో శ్రీలీలా ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకుంది. మరోవైపు పుష్ప 2లో ఐటెమ్ సాంగ్ చేసి టాలీవుడ్ లో రచ్చ రచ్చ చేసింది. చివరిగా రాబిన్ హుడ్ చిత్రంలో అలరించింది. నెక్ట్స్ జూనియర్, మాస్ జాతర, పరాశక్తి, లెనిన్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు బాలీవుడ్ లో 'ఆషికీ 3'లోనూ నటిస్తోంది.

More from Filmibeat

Read more about: sreeleela engagement tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X