అల్లు అర్జున్ కోసం శ్రీలీల కఠిన నిర్ణయం.. ఇకపై అలాంటివి చేయనంటూ..

సినిమా ఇండస్ట్రీలో అనతి కాలంలోనే స్టార్‌డమ్‌ సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీలీల (Sreeleela)ఒకరు. క్యూట్‌ ఫేస్‌, ఎనర్జీ డ్యాన్స్‌, చిరునవ్వుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌కే కాకుండా కోలీవుడ్‌, బాలీవుడ్‌లలోనూ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె నటించిన పరశక్తి (Parashakti)సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో హీరోయిన్ శ్రీలీల బిజీబిజీగా మారింది. ఈ సమయంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే..?

డాన్సింగ్ క్వీన్ శ్రీలీల నటిస్తున్న పరశక్తి సినిమా జనవరి 10న థియేటర్లలోకి రానున్నది. శివకార్తీకేయన్ (Sivakarthikeyan) కెరీర్‌లో 25వ సినిమా కావడం విశేషం. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా రొమాన్స్ చేయనుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవి మోహన్, అథర్వ మురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల తన కెరీర్‌కు సంబంధించిన ఓ కీలక నిర్ణయాన్ని తొలిసారిగా ఓపెన్‌గా వెల్లడించింది.

Sreeleela s Tough Decision for Allu Arjun No More Item Songs After Pushpa 2

శ్రీలీల మాట్లాడుతూ.. సాధారణంగా తాను ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడనని, కానీ కేవలం అల్లు అర్జున్ ( Allu Arjun) నటించిన పుష్ప 2 (Pushpa 2: The Rule)కోసమే ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. 'నాకు హీరోయిన్ పాత్రల్లో డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. కానీ, ఐటమ్ సాంగ్స్ చేయడం నాకు నచ్చదు. అయినా పుష్ప 2 వేరు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో భాగం కావడం నాకు గర్వంగా అనిపించింది' అని ఆమె పేర్కొంది.

పుష్ప 2లో శ్రీలీల చేసిన 'కిస్సిక్' స్పెషల్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియా మొత్తం షేక్ అయింది. చిన్న స్క్రీన్ టైమ్ ఉన్నా, ఆ డ్యాన్స్ ఆమెకు ఊహించని స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది. వరుస ఫ్లాప్‌లతో కాస్త వెనుకబడిన సమయంలో వచ్చిన ఈ అవకాశం ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పవర్‌ఫుల్ ట్యూన్‌, అల్లు అర్జున్‌తో చేసిన మాస్ డ్యాన్స్ కలిసివచ్చాయి.

ఇదే సమయంలో శ్రీలీల తనపై ఉన్న 'డ్యాన్సర్ మాత్రమే' అన్న ఇమేజ్‌పైనా స్పందించింది. 'నన్ను చాలామంది బెస్ట్ డ్యాన్సర్‌గా మాత్రమే చూస్తున్నారు. కానీ నేను కేవలం డ్యాన్సర్ కాదు, మంచి నటిని కూడా. 'భగవంతు కేసరి' సినిమాలో నా నటన అందరికీ తెలిసినదే. అయినా ఆ పర్సెప్షన్ మార్చడం అంత తేలిక కాదు' అంటూ తన మనసులోని భావాలను వెల్లడించింది. తన లక్ష్యం నటిగా మరింత వేరియేషన్ చూపించడమేనని చెప్పింది.

మొత్తం మీద.. అల్లుఅర్జున్ కోసం ఒక్కసారి తీసుకున్న ఆ కఠిన నిర్ణయం శ్రీలీలకు దేశవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఇకపై అలాంటి ఐటమ్ సాంగ్స్ చేయనంటూ ఆమె పెట్టిన ఫుల్ స్టాప్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. డ్యాన్స్ తన ప్యాషన్ అయినప్పటికీ, నటిగా తన సామర్థ్యాన్ని మరింతగా నిరూపించుకోవడమే లక్ష్యమని చెప్పడం శ్రీలీల మెచ్యూరిటీని చాటుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X