HBDSreemukhi : బర్త్‌డే రోజున శ్రీముఖి స్పెషల్.. అభిమానుల కోసం రెడ్ హాట్ ట్రీట్!
శ్రీముఖి.. ఇప్పుడు తెలుగు టెలివిజన్ లో టాప్ యాంకర్‌స్ లో ఒకరిగా దూసుకెళ్తున్నారు. అప్పుడప్పుడు వెండితెరపై కూడా సందడి చేసే ఈ భామ హీరోయిన్ అవ్వాలనే లక్ష్యంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా సరే కాలం కలిసి రాకపోవడంతో బుల్లితెరలో కాలం వెళ్ళదీస్తోంది. అయితేనేమి ఆమె ఇక్కడ బిజీబిజీగా ఉంది. ఈరోజు ఆమె తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
Recommended Video

సినిమా టు టెలివిజన్
తెలుగు టెలివిజన్ యాంకర్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ ముఖి 2012లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'జులాయి' సినిమాలో హీరో చెల్లెలు పాత్రలో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఆ తరువాత ప్రేమ ఇష్క్ కాదల్' అనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. ఆ తర్వాత, శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాలో సైతం సినిమాను మలుపు తిప్పే ముఖ్య పాత్ర పోషించింది. ఆ తర్వాత ఆమె 'నేను శైలజ' సినిమాలో రామ్ చెల్లెలుగా కూడా నటించింది.

టెలివిజన్ స్టార్ యాంకర్
అయితే ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు రాని క్రేజ్ ఆమెకు టెలివిజన్ యాంకర్ గా వచ్చింది. మరీ ముఖ్యంగా శ్రీముఖికి పటాస్ షో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఆమెకు ఇక్కడ లభించిన క్రేజ్ తో బిగ్‌బాస్ 3కి పిలుపు వచ్చింది. అంతేకాదు ఈ షోలో పాల్గొన్న ఆమె ఏకంగా విన్నర్ అవుతుందని అనుకున్నారు, కానీ గట్టిపోటీ ఇచ్చిన ఆమె రన్నరప్‌గా నిలిచి మరింత గుర్తింపు తెచ్చుకుంది.

అందుకే బ్రేకప్
ఇక ఆమె ఆమధ్య తన పెళ్లి గురించి మనసులో మాట బయట పెట్టింది. తన దృష్టిలో ప్రేమ అంటే మంచి ఎమోషన్ అంటున్న శ్రీముఖి ఒకప్పుడు తాను రిలేషన్ షిప్‌లో ఉన్నా ఆ రిలేషన్ షిప్స్ అన్నీ మంచివే అని చెప్పలేమని కొట్టి పారేసింది. ఇప్పుడు అది గుర్తు చేసుకోలేను అని ఆమె చెబుతోంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు తాను ఒకర్ని ప్రేమించి మోసపోయానని కూడా శ్రీముఖి వెల్లడించింది. తాను ప్రేమించిన వాడు పెళ్లైన విషయాన్ని దాచాడని.. అందుకే తను రిలేషన్ నుంచి బయటకు వచ్చేసాను అని ఆమె అప్పట్లో చెప్పింది శ్రీముఖి.

హాట్ ట్రీట్
ఇక ఈరోజు ఆమె పుట్టిన రోజు కావడంతో ఐ వాజ్ బోర్న్ అమేజింగ్ అంటూ ఓ టాప్ వేసుకుని ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. మెరూన్ కలర్ టాప్‌లో మెరిసిన ఈ భామ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా అన్నట్టు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ అమ్మడు పుట్టిన రోజు నాడు హాట్ ట్రీట్ ఇవ్వడంతో ఆ ఫోటోలు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి.
ర్వంగా ఫీల్ అవుతున్నా
ఈ రోజు తాను దిగిన కొన్ని ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన శ్రీముఖి.. మీరంతా చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నా జీవితంలో ఇంత మంది తోడుగా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. సేఫ్‌గా ఇంట్లోనే ఉండండి.. ముఖ్యంగా సంతోషంగా గడపండి' అని రాసుకొచ్చింది.


Click it and Unblock the Notifications











