For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sreemukhi పొట్టి గౌనులో రచ్చ రేపిన శ్రీముఖి.. . నెవర్ బిఫోర్ అనేట్టుగా గ్లామర్ షో!

  |

  తెలుగు ప్రేక్షకులకు శ్రీముఖి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీరంగంలో నటిగా ప్రవేశించి తర్వాత బుల్లితెర యాంకర్ గా పరిచయమైన ఆమె ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్స్ లో ఒకరిగా కొనసాగుతోంది. అయితే మరే యాంకర్ కి సాటి రాని అందంతో, అభినయంతో ఆకట్టుకునే శ్రీముఖి ఈ మధ్య అడపాదడపా కొన్ని హాట్ ఫోటో షూట్లు వదులుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఎప్పటిలాగే తాజాగా ఆమె వదిలిన హాట్ ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే

   సినీ రంగ ప్రవేశం

  సినీ రంగ ప్రవేశం


  తెలంగాణలోని నిజామాబాద్ లో పుట్టిన శ్రీముఖి తొలుత తన విద్య పూర్తి చేసుకుని సినీ రంగ ప్రవేశం చేసింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇలియానా హీరోయిన్ గా నటించిన జులాయి అనే సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు రాజీ అనే పాత్రలో శ్రీముఖి మెరిసింది. అయితే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఎందుకో కానీ వరుస సినిమా అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత ఏడాది ఆమె టీవీ యాంకరింగ్ మొదలుపెట్టింది.

  ప్రేమ ఇష్క్ కాదల్

  ప్రేమ ఇష్క్ కాదల్

  ముందుగా అదుర్స్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. తర్వాత సూపర్ సింగర్ నైన్ కూడా ఆమె హోస్ట్ చేసింది. అలా ఒక పక్క యాంకరింగ్ చేస్తూనే మరో పక్క ప్రేమ ఇష్క్ కాదల్ అనే ఒక సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. అయితే ఆ సినిమా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు కానీ తమిళంలో మాత్రం ఒక అవకాశం తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత ఆమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు రాలేదు కానీ చిన్నాచితకా సినిమాలు ఉన్నాయి.

  బిగ్ బాస్ సీజన్ త్రీలో

  బిగ్ బాస్ సీజన్ త్రీలో


  అలా ఆమె ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క టీవీ షోస్ కూడా చేస్తోంది. మనీ మనీ, సూపర్ మామ్, పటాస్, సూపర్ సింగర్, జూలకటక, భలే చాన్సులే, కామెడీ నైట్స్ వంటి కార్యక్రమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆమెకు బిగ్ బాస్ సీజన్ త్రీలో పాల్గొనే అవకాశం వచ్చింది ఈ సీజన్లో పాల్గొనడమే కాక రన్నరప్గా కూడా నిలిచి ఆమె మంచి క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత కూడా ఆమె కామెడీ స్టార్స్, సరిగమప సూపర్ సింగింగ్ స్టార్ లాంటి కార్యక్రమాలు చేస్తూ జనాల్లోనే ఉంటోంది.

  Recommended Video

  Vikram Hit List Movie Public Talk #VOX | Filmibeat Telugu
  అందాల ఆరబోత

  అందాల ఆరబోత


  ఇక సినిమాల విషయంలో కూడా ఆమె ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఏ మాత్రం అవకాశం ఉన్నా సినిమాల్లో కూడా నటిస్తోంది. ఆమె పూర్తి స్థాయి పాత్రలో చేసిన క్రేజీ అంకుల్స్ సినిమా యావరేజ్ గా ఆడింది. ప్రస్తుతం ఆమె చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ అనే సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఒకపక్క బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా మెరిసిపోతున్న శ్రీముఖి తాజాగా అందాల ఆరబోతకు తెరతీసింది.

  టీజ్ చేస్తూనే

  టీజ్ చేస్తూనే


  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆమె తాజాగా పొట్టి గౌనులో చేసిన ఒక ఫోటో షూట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీముఖి షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ లో ఆమె వైట్ ఫ్లోరల్ ఫ్రాక్లో కనిపిస్తోంది. ఒకపక్క ఎద అందాలు కనిపించీ కనిపించకుండా టీజ్ చేస్తూనే మరో పక్క తొడల అందాలతో ఆమె రచ్చ రేపుతోంది.

  ఇంకెందుకు ఆలస్యం

  ఇంకెందుకు ఆలస్యం


  ఇక ఆమె ఫొటోలు చూసిన ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటూ ఆమె మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరైతే సొగసు చూడ తరమా శ్రీముఖి అందాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు అంటూ కవి కాళిదాసులయిపోయి కవిత్వాలు కూడా కురిపిస్తున్నారు. ఇంకొందరు మీరు చీర కట్టిన, లంగావోని చుట్టిన ఫ్రాక్ వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటారు అంటూ ఆమె మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.

  English summary
  anchor, actor Sreemukhi latest white floral frock photoshoot gone viral in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X