twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వావ్: తనలో మరో టాలెంట్ బయటపెట్టిన శ్రీముఖి.. ఎవరూ ఊహించి ఉండరు!

    |

    ఇప్పుడు తెలుగు టెలివిజన్ లో టాప్‌ యాంకర్‌స్ లో ఒకరిగా దూసుకెళ్తున్న శ్రీముఖి అంటే తెలియని వారు ఉండరు. అప్పుడప్పుడు వెండితెరపై కూడా సందడి చేసే ఈ భామ హీరోయిన్‌ అవ్వాలనే లక్ష్యంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా సరే కాలం కలిసి రాకపోవడంతో బుల్లితెరలో కాలం వెళ్ళదీస్తోంది. అయితేనేమి ఆమె ఇక్కడ బిజీబిజీగా ఉంది. 2012లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'జులాయి' సినిమాలో హీరో చెల్లెలు పాత్రలో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్' అనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది.

    ఆ తర్వాత, శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాలో సైతం సినిమాను మలుపు తిప్పే పాత్రలో నటించింది. ఆ సినిమా ఆ తర్వాత ఆమె 'నేను శైలజ' సినిమాలో రామ్ చెల్లెలుగా కూడా నటించింది. ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు రాని క్రేజ్ ఆమెకు టెలివిజన్ యాంకర్ గా వచ్చింది. మరీ ముఖ్యంగా శ్రీముఖికి ప‌టాస్ షో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ క్రేజ్ తో బిగ్‌బాస్ 3కి పిలుపు వచ్చింది.

    Sreemukhi shares her new talent on the eve of Buddha Purnima

    అంతేకాదు ఈ షోలో పాల్గొన్న ఆమె ఏకంగా విన్నర్ అవుతుందని అనుకున్నారు, కానీ గట్టిపోటీ ఇచ్చిన ఆమె రన్నరప్‌గా నిలిచి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతానికి అడపాదడపా షోలు చేస్తున్న ఈమె సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని రకరాకాల వీడియోలు చేస్తోంది. అయితే ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లు చేస్తూ రచ్చ చేసే ఈ భామ ఈరోజు మాత్రం తనలో ఉన్న మరో టాలెంట్ బయటపెట్టింది. ఈరోజు బుద్ధ పౌర్ణిమ కావడంతో స్వయంగా ఒక బుద్ధుడు పెన్సిల్ స్కెచ్ వేసి అందరికీ షాక్ ఇచ్చింది ఈ భామ. స్కెచ్ వేస్తున్న వీడియోను కూడా ఆమె తన అభిమానులతో పంచుకుంది. ఆ స్కెచ్ కూడా అద్భుతంగా వచ్చింది. ఇంకెందుకు మీరు కూడా చూసేయండి మరి.

    English summary
    Popular actress-TV host Sreemukhi shares her new talent on the eve of Buddha Purnima. she drawn an excellent sketch of Buddha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X