శ్రీ రెడ్డి డైరీ లీక్.. వివాదాస్పద నటి గుప్పిట్లో సినీ పెద్దల జాతకాలు!

టాలీవుడ్ ప్రముఖులపై వివాదాస్పద నటి శ్రీ రెడ్డి చేసిన లైంగిక ఆరోపణలు తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేశాయి. పలువురు సినీ పెద్దలను టార్గెట్‌గా చేసుకొని ఆమె చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పలువురు శ్రీరెడ్డి బాటలో నడవడంతో టాలీవుడ్ పరిశ్రమ ప్రతిష్ట మసక బారిన పనైంది. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో శ్రీ రెడ్డి మరోసారి తన అస్త్రాన్ని వెండితెర మీద సంధించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

దిగంబర ప్రదర్శనతో సంచలనం

దిగంబర ప్రదర్శనతో సంచలనం

టాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులపై నిరసన వ్యక్తం చేస్తూ ఫిలింఛాంబర్ వద్ద శ్రీ రెడ్డి దిగంబర ప్రదర్శనకు పూనుకోవడం తెలుగు సినీ పరిశ్రమ ప్రకంపనలకు లోనైంది. శ్రీ రెడ్డి వ్యవహారం జాతీయ మీడియాను ఆకర్షించింది. దాంతో ఒక్కసారిగా శ్రీ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి దుమారం

సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి దుమారం

ఆ తర్వాత వరుసగా సోషల్ మీడియాలో తనకు ఆఫర్లు ఇస్తానని చెప్పి శారీరకంగా వాడుకొన్నారంటూ కొందరు ప్రముఖుల పేర్లను బయటపెట్టింది. అలా వరుసగా ట్వీట్లు, ఫేస్‌బుక్ పోస్టులతో సంచలనం రేపింది. దాంతో శ్రీ రెడ్డి వివాదం మరో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

తమిళ సినీ ప్రముఖులపై ఎటాక్

తమిళ సినీ ప్రముఖులపై ఎటాక్

కేవలం తెలుగు పరిశ్రమనే కాకుండా తమిళ పరిశ్రమను కూడా టార్గెట్ చేసింది. ప్రముఖ దర్శకులు ఏఆర్ మురగదాస్, సుందర్ సీ, విశాల్, రాఘవ లార్సెన్స్ లాంటి ప్రముఖులపై పోస్టులు పెట్టింది. అలా తన ఆరోపణలను కొనసాగిస్తూ శ్రీరెడ్డి మీటూ ఉద్యమానికి తెర లేపింది.

నిర్మాత కుమారుడితో అఫైర్ అంటూ

నిర్మాత కుమారుడితో అఫైర్ అంటూ

మీటూ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన శ్రీ రెడ్డి తనకు ప్రముఖ నిర్మాత కుమారుడితో అఫైర్ కూడా కొనసాగిందని కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది. ఈ వివాదాల మధ్య ఫోటోలను లీక్ చేయడం మరింత సంచలనం రేపింది. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి తన మకాంను చెన్నైకి షిష్ట్ చేసి అప్పుడప్పుడు ప్రముఖులపై కామెంట్ల జోరును కొనసాగిస్తున్నది.

రెడ్డీ డైరీ రిలీజ్ ఎప్పుడంటే

రెడ్డీ డైరీ రిలీజ్ ఎప్పుడంటే

ప్రస్తుతం శ్రీరెడ్డి జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనల ఆధారంగా ప్రముఖ దర్శకుడు బాలా శిష్యుడు రాజంగమ్ రెడ్డీ డైరీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ చిత్రంలో సినీ పెద్దల జాతకాలను బయటపెట్టే విధంగా కథ, కథనాలు ఉంటాయని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X