For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కత్తి మరణం 99 % అనుమానమే.. పవన్ పిలిస్తే రెడీ, మాట మార్చేసిన శ్రీరెడ్డి

  |

  గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా సోషల్ మీడియా కు పూర్తిగా దూరంగా ఉంటున్న శ్రీరెడ్డి యూట్యూబ్ ఇంటర్వ్యూ ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చింది.. అయితే చివరిగా కత్తి మహేష్ మరణానికి సంబంధించి కొన్ని పోస్టులు పెట్టిన తర్వాత ఆమె సోషల్ మీడియా నుంచి దూరమయ్యారు.. దీంతో కత్తి మహేష్ మరణం గురించి ఆమె తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.. తమ మధ్య బంధం ఎలాంటిది ? ఈ మరణం వెనుక అనుమానాలు అనే అంశాల మీద ఆమె స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

  Kathi Mahesh మరణంపై అనుమానాలు? ఆక్సిజన్ పైప్ పీకేశారా? || Filmibeat Telugu
  ఆ వ్యవహారంతో వెలుగులోకి

  ఆ వ్యవహారంతో వెలుగులోకి

  వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి నటించింది ఒకటి రెండు సినిమాలే అయినా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని పట్టి కుదిపేసిన క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంతో వెలుగులోకి వచ్చారు. అసలు అప్పటి వరకూ శ్రీ రెడ్డి అనే ఒక నటి ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు కానీ ఆమె సురేష్ బాబు చిన్న కుమారుడు తనను లైంగికంగా వాడుకునే అవకాశం ఇవ్వకుండా వదిలేశాడు అంటూ ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శనకి దిగడంతో అప్పటినుంచి శ్రీ రెడ్డి పేరు మారుమోగిపోయింది. అయితే ఈ వ్యవహారం తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో కనిపించింది కూడా లేదు.

  వైసీపీ తరఫున

  వైసీపీ తరఫున

  చెన్నైకి మకాం మార్చేసిన ఈ భామ అడపాదడపా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చని వారిని సినీ రాజకీయ రంగాలకు చెందిన కొంతమంది ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని ఎవరు విమర్శించే వారిని టార్గెట్ చేసుకుని ఆమె కొన్నాళ్లుగా రెచ్చిపోతూ వస్తున్నారు.. దానికి తగ్గట్టు తనకు రాజకీయ రంగ ప్రవేశం చేయాలని ఉందని జగన్ అందుకు అవకాశం ఇస్తే తాను వైసీపీ తరఫున అధికారికంగా పోరాడుతా అని కూడా ఆమె జగన్ కు విజ్ఞప్తి చేశారు.

  అయితే కొన్ని రోజులుగా ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండడం తోనే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని వీలైనంత త్వరలో మళ్ళీ ఆక్టివ్ అవుతానని కూడా చెప్పుకొచ్చారు..

  కత్తితో బంధం

  కత్తితో బంధం

  తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కత్తి మహేష్ మరణం గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.. తనకు కత్తి మహేష్ చాలా మంచి స్నేహితుడని ఆమె వెల్లడించారు.. ఆయన ఎప్పుడూ చెన్నైకు వచ్చిన తనను కలవకుండా వెళ్లే వారు కాదని అలాగే తాను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆయన నన్ను కలవకుండా వెళ్ళేదాన్ని కాదు అని అన్నారు. కత్తి మహేష్ లాంటి మిత్రులు చాలామంది ఉన్నారని మేమంతా మంచి సర్కిల్ లాగా ఉంటామని వెల్లడించారు శ్రీరెడ్డి. అదే కత్తి మహేష్ మరణం తనని బాధించిందని బహుశా ఆయన మరణం కూడా తన డిప్రెషన్ కు కారణం అయి ఉండొచ్చని ఆమె వెల్లడించారు.

  నమ్మలేదు

  నమ్మలేదు

  కత్తి మహేష్ మరణానికి కొద్ది రోజుల ముందు ఒక స్నేహితుడు కరోనా కారణంగా చనిపోగా మరో స్నేహితుడు సూసైడ్ చేసుకుని చనిపోయారని వారి చావు తోనే బాధపడుతున్న తనని కత్తి మహేష్ మరణం ఇంకా బాధ పెట్టిందని అన్నారు. అసలు కత్తి మహేష్ చనిపోయాడు అనే విషయాన్ని తాను జీర్ణించుకోలేక పోయానని ఆయన చనిపోయాక కూడా నమ్మ లేదని అన్నారు.

  ఇక ఈ మృతి వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి కదా అని ప్రశ్నించగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసినట్లు తాను విన్నానని అని ఆమె అన్నారు. ఆ డ్రైవర్ విషయంలో కొంచెం అనుమానంగానే ఉన్నా 99% హత్య ప్రయత్నం లాంటివి జరిగి ఉండదని శ్రీరెడ్డి పేర్కొంది. ట్రీట్ మెంట్ విషయంలో పూర్తి స్థాయిలో అంది ఉండకపోవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

  ఇచ్చినా ఇవ్వచ్చు

  ఇచ్చినా ఇవ్వచ్చు

  ఇక పవన్ తో సినిమా చేసే విషయం గురించి కూడా శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాము కెమెరా ముందు ఉన్నట్లే నిజజీవితంలో ఉండమని, ఎవరినైనా తాము వ్యతిరేకిస్తున్నామని అంటే వారి విధానాలను వ్యతిరేకిస్తున్నామని తప్ప వ్యక్తులను కాదని ఆమె చెప్పుకొచ్చారు. సినిమాల విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ అని ఆమె వెల్లడించారు.

  తనకు పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్ ఇస్తే పవన్ కళ్యాణ్ తో కూడా నటించడానికి సిద్ధమని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. అసలు ఆయన ఎందుకు ఇస్తారు అంటూ యాంకర్ ప్రశ్నించగా ఒకవేళ ఇస్తే తాను ఆయన విధానాలను నచ్చకపోయినా ఆయన తో నటిస్తానని చెప్పుకొచ్చారు. ఇచ్చిన ఇవ్వచ్చు ఎందుకంటే వృత్తి ఈ విషయంలో ఆయన కొంచెం పర్వాలేదని శ్రీ రెడ్డి చెప్పు వచ్చింది. కానీ రాజకీయాలు ఆయనకు సూట్ అవ్వదు అనేది తన ఉద్దేశం అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా ఎదగాలని తమ అధినేత జగన్ కు దీటుగా పోటీ ఇచ్చే స్థాయిలో నిలబడాలని ఆశిస్తున్నా అని చెప్పుకొచ్చారు.

  English summary
  Sri reddy came back with an interview. she made some intresting comments on pawan kalyan and Kathi Mahesh death.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X