twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్దరాత్రి శ్రీరెడ్డి ఇంటికి వచ్చి దాడి, ఫైనాన్షియర్ మీద పోలీసులకు ఫిర్యాదు!

    |

    కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై శ్రీరెడ్డి ఇటు టాలీవుడ్‌తో పాటు అటు కోలీవడ్లోనూ పలు సంచలనాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. సౌత్ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో వెల్లడిస్తూ పలువురు సినీ ప్రముఖుల పేర్లను సైతం ఆమె బయట పెట్టారు. తాను చేస్తున్న పోరాటానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కానీ, తెలుగు సినీ ప్రముఖుల నుంచి కానీ ఎలాంటి మద్దతు లభించక పోవడం, ఇక్కడ సినిమా అవకాశాలు సైతం లేక పోవడంతో చెన్నైకి మకాం మార్చారు. ఇక్కడి వలసరవాక్కంలోని అన్బు నగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇటీవల హైదరాబాద్ వచ్చి తిరిగి చెన్నై వెళ్లిన ఆమెపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీరెడ్డి చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఆ ఇద్దరూ నాపై దాడి చేశారు

    ఆ ఇద్దరూ నాపై దాడి చేశారు

    సినీ ఫైనాన్సియర్ సుబ్రమణి, అతడి అసిస్టెంట్ గోపీ మార్చి 21న అర్దరాత్రి తన అపార్టుమెంటుకు వచ్చారని, తనపై దాడి చేశారని, చంపుతామని బెదిరించారని శ్రీరెడ్డి వలసరవాక్కం పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

    ఆ కోపంతో దాడి జరిగిందా?

    ఆ కోపంతో దాడి జరిగిందా?

    వలసరవాక్కం పోలీసు అధికారులు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఫైనాన్సియర్ సుబ్రమణిని పోలీసులు ఓ కేసులో అరెస్టు చేశారు. దానికి కారణం శ్రీరెడ్డి కావడంతో చెన్నై వచ్చి ఆమెను బెదిరించినట్లు సమాచారం.

    ఆ ఇష్యూను వదలను అంటున్న శ్రీరెడ్డి

    ఆ ఇష్యూను వదలను అంటున్న శ్రీరెడ్డి

    ఇటీవల తమిళనాడులో సంచలనం రేపిన పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసుపై శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పోస్టులో స్పందించారు. ఈ అంశాన్ని వదలను, ఫైట్ చేయడానికే చెన్నై వచ్చాను... అందుకే నా శత్రువులు నాపై దాడి చేశారని శ్రీరెడ్డి తెలిపారు.

    దేవుడి దయవల్లే, పోలీసులకు థాంక్స్

    దేవుడి దయవల్లే, పోలీసులకు థాంక్స్

    అర్దరాత్రి నా ఇంటికి వచ్చి నాపై దాడి చేశారు, చంపుతామని బెదిరించారు. దేవుడి దయవల్లే నేను సేఫ్‌గా ఉన్నాను. నాకు అండగా ఉన్న తమిళనాడు పోలీసులకు థాంక్స్ అంటూ శ్రీరెడ్డి తన ఫేజీలో పేర్కొన్నారు.

    English summary
    Sri Reddy has filed a complaint with the Valasaravakkam police officials, saying that financier Subramani and his assistant Gopi had come to her apartment on March 21 night to threaten her. She also added that they both assaulted her and issued life threats.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X