ప్రభాస్‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. అదేంట్రా బాబు అలా ఉంది అంటూ కామెంట్
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మల్లిడి రకరకాల వార్తలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటారు. తనకు నచ్చిన వారిపై ప్రశంసలు, నచ్చని వారిని ఏకిపారేస్తూ హంగామా చేస్తుంటారు. ప్రతీ రోజు రాజకీయాలు, సినిమా రంగంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా ప్రభాస్‌ను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. అదేమిటంటే..

మీటూ ఉద్యమంతో
తెలుగు సినిమా పరిశ్రమలో మీటూ ఉద్యమాన్ని ప్రారంభించిన శ్రీరెడ్డి ఆ తర్వాత దానిని దక్షిణాది వ్యాప్తి చేయడంలో సఫలమయ్యారు. శ్రీరెడ్డి ప్రారంభించిన ఉద్యమానికి జాతీయ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చారు.

తెలుగు, తమిళ సెలబ్రిటీలపై
ఇక తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోని సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గందరగోళంగా మారింది. తాజాగా విశాల్‌ను ఉద్ధేశించి కూడా శాపనార్థాలు పెట్టారు. విశాల్ డౌన్‌ఫాల్ మొదలైంది అంటూ కామెంట్ చేసి మరో వివాదానికి తెర లేపారు.

ప్రభాస్‌ను ఆకాశానికి ఎత్తి వేస్తూ
ఇలాంటి వివాదాల మధ్య ప్రభాస్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ శ్రీరెడ్డి పోస్టు పెట్టారు. ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ టీజర్ గురించి శ్రీరెడ్డి స్పందించారు. ఇప్పటికే అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సలార్ మూవీలో ప్రభాస్ బాడీ గురించి ఘాటుగా కామెంట్లు చేశారు.

ప్రభాస్‌ను అంటే దిష్టి తగులుతుందో
యంగ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఇలా అంటే దిష్టి తగులుతుందేమో. కాని వామ్మో సలార్ మూవీలో ఆ బాడీ ఏంట్రా బాబు అలా ఉంది. ప్రభాస్ ది సలార్ మూవీకి సంబంధించిన టిజర్‌లోనే ఇలా ఉంటే ఇంకా సినిమాలో ఫైట్‌లో ఎలా ఉంటుందో అని తన పోస్టులో శ్రీరెడ్డి పేర్కొన్నారు.

సిల్క్ స్మిత జీవితం ఆధారంగా
ఇక శ్రీరెడ్డి కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











