ఇకపై ఎవరైనా శ్రీరెడ్డితో పెట్టుకున్నారో అంతే... వన్ పంచ్‌తో ఫసక్!
Recommended Video

ఇప్పటి వరకు అందరూ శ్రీరెడ్డి నోటి పవర్ మాత్రమే చూశారు. ఆమెతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో గతంలో జరిగిన పలు సంఘటనలే నిదర్శనం. అయితే ఇకపై ఆమెతో ఎవరైనా పెట్టుకుంటే హ్యాండ్ పవర్ కూడా చూడాల్సి వస్తుందేమో!
ప్రస్తుతం శ్రీరెడ్డి మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ లాంటి సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ తీసుకుంటోంది. అఫ్ కోర్స్ ఇవన్నీ తను నటిస్తున్న సినిమా కోసమే అయినా... ఎందుకైనా మంచిది ఆమెతో గొడవలు గట్రా పెట్టుకోక పోవడమే బెటర్ అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.
టేస్ట్ మై పంచ్
తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో టేస్ట్ మై పంచ్ అంటూ.... ఓ వీడియోను షేర్ చేసింది. లోకేష్ మాస్టర్ దగ్గర ఆమె బాక్సింగ్ నేర్చుకుంటోంది. ఈ వీడియోలో ఆమె పవర్ ఫుల్‌గా పంచ్‌లు గుప్పిస్తూ చాలా ఎనర్జీగా కనిపించింది.
సెల్ఫ్ డిఫెన్స్
బాక్సింగ్‌తో పాటు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ సైతం తీసుకుంటోంది. శ్రీరెడ్డి జోరు చూస్తుంటే తమిళంలో యాక్షన్ సినిమాలు, పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై కన్నేసినట్లు స్పష్టమవుతోంది.
బుల్లెట్ రైడింగ్
శ్రీరెడ్డి తన తర్వాతి సినిమా కోసం బుల్లెట్ రైడింగ్ సైతం నేర్చుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఫేస్ బుక్ పేజీ ద్వారా షేర్ చేశారు. ఈ బైక్ నాకు చాలా నచ్చింది అంటూ ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.

హెల్మెట్ పెట్టుకోలేదంటూ..
అయితే శ్రీరెడ్డి హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతుండటంపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీపై యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అంటూ కొందరు హెచ్చరించారు కూడా, మరికొందరు అభిమానులు మాత్రం నువ్వు గుర్రం ఎక్కడిన ఝాన్సీ రాణిలా ఉన్నావంటూ ప్రశంసలు గుప్పించారు.


Click it and Unblock the Notifications











