అమ్మాయిలు లేకుండా కొడుక్కి నిద్రపట్టదు: సంచలనం రేపుతున్న శ్రీరెడ్డి పోస్ట్, ఎవరి గురించి?
Recommended Video

వివాదాలకు కేంద్ర బింధువుగా మారిన శ్రీరెడ్డి తాజాగా తన ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది. అయితే ఎవరి పేర్లు ప్రస్తావించకుండా పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేడీస్ లేకుండా కొడుక్కి నిద్రపట్టదు, మందు లేకుండా తండ్రికి నిద్రపట్టదు అంటూ ఆమె ఈ కామెంట్స్ చేశారు.
గతంలోనూ శ్రీరెడ్డి పలువురు స్టార్ హీరోలను ఉద్దేశించి ఫేస్ బుక్ వేదికగా పరోక్షంగా ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ప్రముఖులుగా వెలుగొందుతున్న వారిని టార్గెట్ చేస్తూ వారి అందరి భాగోతాలు తన వద్ద ఉన్న పెన్ డ్రైవ్‌లో భద్రంగా ఉన్నాయని, సమయం వచ్చినపుడు వాటిని బయటపెడతాను అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

సంచలనం రేపుతున్న శ్రీరెడ్డి తాజా పోస్ట్ ఇదే
లేడీస్ లేకుండా కొడుక్కి నిద్రపట్టదు, మందు లేకుండా తండ్రికి నిద్రపట్టదు అంటూ శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్స్ సినిమా వారి గురించి కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తమిళనాడులో ఉంటూ తెలుగు రాష్ట్రాలపై కన్న
ఆ మధ్య శ్రీరెడ్డి టాలీవుడ్లో మొదలు పెట్టిన కాస్టింగ్ కౌచ్ పోరాటం చివరకు ఊహించని మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆమె హైదరాబాద్ వదిలేసి చెన్నైకి మకాం మార్చారు. తమిళనాడులో ఉంటూ తెలుగునాట ఓ కన్నేసి ఉంచిన ఆమె ఇక్కడ జరిగే పరిణామాలను పరిశీలిస్తూ ఫేస్ బుక్‌లో పోస్టులు పెడుతున్నారు.

తమిళ సినిమా అవకాశాలతో బిజీ బిజీ
చెన్నై వెళ్లిన తర్వాత శ్రీరెడ్డి జాతకం మారిపోయిందనే చెప్పొచ్చు. అక్కడ వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది. అక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సెటిలవ్వడం విశేషం.

అక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకుని సెటిలవుతుందా?
శ్రీరెడ్డి తీరు చూస్తుంటే తమిళనాడుకు చెందిన వ్యక్తినే పెళ్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... చాలా మంది తమిళులు తమ భార్య నటిగా ఉండాన్ని ఇష్టపడరు. నాకు మంచి భర్త దొరికితే తాను నటనను వదిలేయడానికి సిద్ధమే అని శ్రీరెడ్డి తెలిపారు. ప్రతి రోజు నన్ను బుజ్జి, చిట్టి, బంగారం అంటూ ప్రేమగా చూసుకునే వాడు భర్తగా కావాలని శ్రీరెడ్డి కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











