వాళ్ళు నా మొగుళ్ళు ..నన్ను వదలట్లేదు...మరో రచ్చ రేపిన శ్రీ రెడ్డి!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉన్నాయని చెబుతూ నటి శ్రీరెడ్డి సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ ఇంతా కావు. ఎవరినీ వదలకుండా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదలు దాదాపు అందరినీ టార్గెట్ చేస్తూ ఆమె విమర్శలు చేసింది. మరీ ముఖ్యంగా ఆమె దగ్గుబాటి రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ ను టార్గెట్ చేసి పర్సనల్ ఫోటోలు కూడా లీక్ చేసి అప్పట్లో పెను దుమారం రేపింది.

తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ చెన్నై కు మకాం మార్చేసిన ఈ బ్యూటీ వీలు చిక్కినప్పుడల్లా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఉంటుంది. తాజాగా వాళ్ళందరూ నా మొగుళ్ళు నేను వదిలించుకోవాలి అనుకున్నా వదలరు అంటూ సంచలన కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. ఆ వివరాల్లోకి వెళితే..

స్విమ్మింగ్ పూల్‌లో అర్ధనగ్నంగా.. హాట్ హాట్‌గా యువ హీరోయిన్ అందచందాలు

చెన్నైలో సెటిలయి

చెన్నైలో సెటిలయి

టాలీవుడ్ ని వదిలేసి ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టింది శ్రీరెడ్డి. పలు యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తూ చెన్నైలో నివాసం ఉంటోంది. అయినా సరే అప్పుడప్పుడూ కొందరిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా పవన్ గురించి ఎప్పుడూ ఏదో ఒక అంశం మీద పోస్టులు పెడుతూనే ఉంటుంది.

అయినా పవన్ ని వదలట్లేదు

అయినా పవన్ ని వదలట్లేదు

అయితే పవన్ కళ్యాణ్ కు తాజాగా కరోనా సోకడంతో ఆమె పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి కొన్ని మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు పెను దుమారానికే దారి తీశాయి. తన గురువు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత అప్పగించారు అని చెబుతూ కొన్ని మార్ఫింగ్ చేసిన పిక్స్ పోస్ట్ చేసి రచ్చ రేపింది. అయితే పవన్ ఫ్యాన్స్ కూడా గట్టిగా ఎటాక్ చేశారు అనుకోండి.

ఆయనని కావాలనే టార్గెట్ చేస్తున్నారు

ఆయనని కావాలనే టార్గెట్ చేస్తున్నారు

సినిమా విషయాలతో పాటు అప్పుడప్పుడు రాజకీయాల మీద కూడా స్పందించే శ్రీరెడ్డి తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా మాట్లాడింది. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలనే కారణంగా ఒక పెద్ద పార్టీ అరవింద్ కేజ్రీవాల్ కు సహకరించడం లేదని ఢిల్లీలో జరుగుతున్న అన్నిటికీ కేజ్రీ వాలే కారణం అన్నట్లుగా మీడియా కూడా ఆయన టార్గెట్ చేస్తోందని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ఎన్నికల కోసం ప్రజలను బలి చేస్తున్నారని మీడియా మీద కూడా శ్రీ రెడ్డి ఫైర్ అయ్యింది. అయితే ఈ పోస్ట్ లోనే ఆమె ఊహించని కామెంట్స్ చేసింది.

దేవుడు ఇచ్చిన మొగుళ్ళు రా

దేవుడు ఇచ్చిన మొగుళ్ళు రా

కేజ్రీవాల్ కోసం పెట్టిన పోస్ట్ కింద ఆమె మీమ్ క్రియేటర్స్ అందరూ తనకు రంకుమొగుళ్ళు అని, వాళ్ళు తనను వదలరు అని రాసుకొచ్చింది, అలాగే అరే మీమ్ క్రియేటర్స్ మీరు నాకు దేవుడు ఇచ్చిన మొగుళ్ళు రా అంటూ కామెంట్ చేసింది. అసలు అసందర్భంగా మీమ్ క్రియేటర్స్ గురించి ఈ పోస్ట్ లో ఎందుకు కామెంట్ చేసిందో తెలియదు. కానీ ఈ కామెంట్స్ ను మళ్ళీ మీమ్ పేజీలు అన్నీ వైరల్ చేస్తున్నాయి. అయితే వార్తల్లో నిలవాలి అనిపించినప్పుడు ఇలా ఎవరో ఒకరిని టార్గెట్ చేయడం శ్రీరెడ్డికి అలవాటుగా మారిపోయిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Recommended Video

Allu Arjun Pushpa Breaks RRR Record, Hail Allu Arjun || Filmibeat Telugu
శ్రీరెడ్డి ఒడిలో పవన్

శ్రీరెడ్డి ఒడిలో పవన్

ఇక తాజాగా కూడా ఆమె పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది. పవన్ కళ్యాణ్ తన ఒడిలో పడుకున్నట్లు ఉన్న ఒక మార్ఫింగ్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ రెడ్డి తన ఎదతో పవన్ కళ్యాణ్ కు ఆక్సిజన్ అందిస్తున్నామని ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ కోలుకుంటాడు అని చెప్పుకొచ్చింది. తనకు ఉన్న ఏకైక శత్రువు పవన్ ను కాపాడుకోవాలని, లేకపోతే తాను గొడవ పడడానికి మరో శత్రువు ఉండడు అని ఆమె పేర్కొంది. దీంతో ఆమెను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అనుకోండి అది వేరే విషయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X