For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంత విడాకుల వ్యవహారంలో శ్రీరెడ్డి ఎంట్రీ.. అతనితో క్లోజ్ గా ఉండేది, డబ్బు మీద పిచ్చితో అలా అంటూ షాకింగ్ కామె

  |

  అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం తర్వాత కూడా రకరకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పటిదాకా వారిద్దరు ఎందుకు విడి పోతున్నారు అనే విషయం మీద క్లారిటీ ఇవ్వకపోవడంతో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో రకరకాల కథనాలు పుట్టుకు రాగా తాజాగా ఈ విషయం మీద వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  రకరకాల ప్రచారాలు

  రకరకాల ప్రచారాలు


  ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సమంత, నాగ చైతన్య విడిపోతున్నట్లు కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. అలా ప్రకటించిన సమయంలో ఎందుకు విడిపోతున్నాం అనే విషయం నాగచైతన్య, సమంత గాని చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అది వారి పర్సనల్ విషయం కాబట్టి. అయితే వారు చెప్పకపోవడంతో ఈ విడాకులకు కారణం సమంత అని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఆమె సినిమాల్లో ఘాటుగా నటించడంతో పాటు ప్రీతమ్ జుకల్కర్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు పెట్టి ఇలా చేయడం వల్ల సమంతకు నాగచైతన్య విడాకులు ఇచ్చారు అంటూ ప్రచారం చేస్తున్నారు.

  ఘాటుగా స్పందించి

  ఘాటుగా స్పందించి

  ఈ విషయం మీద ఇప్పటికే సమంత ఘాటుగా స్పందించింది. నాకు అఫైర్లు ఉన్నాయని అంటున్నారు, అలాగే పిల్లలు కనాలని అనుకోలేదు కాబట్టి విడాకులు ఇచ్చాడని అంటున్నారు అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కానీ అలాంటిది ఏదీ లేదని అలా ప్రచారం చేసి నన్ను ఎవరు ఈ విషయంలో వెనక్కి లాగలేరని కూడా ఆమెను ఘాటుగానే స్పందించింది. ఇదే విషయం మీద ఆమె పర్సనల్ డిజైనర్ ప్రీతం కూడా స్పందిస్తూ తనను అక్క అని పిలుస్తాను అనే విషయం నాగచైతన్య కూడా తెలుసని కానీ ఆయన స్పందించకపోవడం తను బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు.

  అక్కాతమ్ముళ్ల సంబంధం

  అక్కాతమ్ముళ్ల సంబంధం

  ఈ విషయం మీద సమంత సన్నిహితులు కూడా అలాగే స్పందిస్తూ ఈ విషయం మీద పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరమే లేదని ఎందుకంటే వారిద్దరి మధ్య ఉన్న సంబంధం అక్కాతమ్ముళ్ల సంబంధం అని చెప్పుకొచ్చారు. ఇదే విషయం మీద తాజాగా శ్రీరెడ్డి స్పందించింది. సమంతకు ప్రీతం జుక్కల్కర్ కు లింక్ పెట్టాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడింది. నాకు తెలిసి నాగచైతన్య సమంత విడిపోవడానికి ప్రధాన కారణం అది కాదని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

  పెళ్లిళ్లలో సమంత

  పెళ్లిళ్లలో సమంత

  సమంత సినిమాల్లోకి రాకముందు పెళ్లిళ్లలో ఆహ్వానం పలికే రిసెప్షనిస్ట్ జాబ్ చేసేది అని, అంత చిన్న స్థాయి నుంచి వచ్చింది కాబట్టి సాధారణంగానే ఉన్న డబ్బు వ్యామోహంతో ఆమె బంగారం లాంటి కెరీర్ ని నాశనం చేసుకుందని శ్రీరెడ్డి అభిప్రాయపడింది. నాగచైతన్య ఇచ్చిన ఫ్రీడంని తప్పుగా వాడుకుందని పేర్కొన్న శ్రీరెడ్డి కరీనా కపూర్, ఐశ్వర్యరాయ్, శిల్పా శెట్టి లాంటివాళ్ళు వివాహ బంధానికి గౌరవం ఇచ్చి పెళ్ళి తర్వాత సినిమాలు మానేశారని పెద్దగా కల్చర్ లేదని మన వాళ్ళు విమర్శించే బాలీవుడ్ వాళ్లే అంత గౌరవం ఇస్తే సమంతకు ఏమైందని ఆమె ప్రశ్నించింది.

  Recommended Video

  Bigg Boss 5 Telugu Beauty Hamida Exclusive Interview
  అందుకే క్లోజ్ గా

  అందుకే క్లోజ్ గా


  నిజానికి సమంత పెద్ద హైట్ కూడా కాదు కలర్ కూడా కాదు చూడడానికి క్యూట్ గా ఉంటుంది అంతే, సైడ్ యవ్వారాలు కూడా కచ్చితంగా ఉండే ఉంటాయి అని పేర్కొన్న శ్రీరెడ్డి అది నాగచైతన్యకా ? సమంతకా? అనేది మాత్రం క్లియర్ గా చెప్పలేను అని చెప్పుకొచ్చింది. నిప్పు లేకుండా పొగ రాదని పేర్కొన్న ఆమె జుక్కల్కర్ తో ఉన్న సంబంధం వల్ల విడాకులు వచ్చాయనేది మాత్రం నిజం కాదని నేను అయితే కచ్చితంగా నమ్మను అని శ్రీరెడ్డి కుండబద్దలు కొట్టింది. అతను చూడడానికే గే లాగా ఉంటాడు, నాకు పర్సనల్గా తెలిసిన విషయం కూడా ఏంటంటే అతను గేనే, అందుకే సమంతతో అతను చనువుగా ఉండేవాడు, అతనితో ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి సమంత కూడా కాస్త క్లోజ్ గానే ఉండేదని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

  English summary
  Sri Reddy made Sensational Comments on Samantha divorce issue
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X