twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుట్టుకతో వ్యభిచారినా? వాళ్లే చిదిమేశారు.. పడుకోకపోతే సాధించలేవని.. నేను ఒంటరిగా ఉంటే.. శ్రీరెడ్డి

    |

    తెలుగు సినిమా ఇండస్ట్రీపై శ్రీరెడ్డి మరోసారి భగ్గమన్నారు. తాజా ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి తన ఆవేదనను వెళ్లగక్కారు. తనపై ఆరోపణల చేస్తున్న వారికి సమాధానంగా తన గళాన్ని వినిపించారు. అవకాశాల కోసం తాను దిగజారానని, ఆ సమయంలో కెరీర్ కోసమే బోల్డ్‌గా మారానని శ్రీరెడ్డి వెల్లడించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే ..

     రూ.5 కోట్లు తీసుకొన్నానని

    రూ.5 కోట్లు తీసుకొన్నానని

    తెలుగు సినిమా పరిశ్రమలో స్థానిక అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు. తమిళంలో పరిస్థితి అలా లేదు. ప్రతిభ ఉంటే ఆఫర్లు ఇస్తారు. నేను తమిళ పరిశ్రమకు రావడంపై అనేక ఆరోపణలు చేశారు. మీ టూ ఉద్యమం తర్వాత రూ.5 కోట్లు తీసుకొని వెళ్లిపోయిందని ఆరోపిస్తున్నారు. నా బ్యాంక్ అకౌంట్ చూపిస్తా అందులో లక్ష రూపాయలు కూడా లేవు.

     సినీ పెద్దలు తొక్కేశారని

    సినీ పెద్దలు తొక్కేశారని

    నాకు తల్లిదండ్రుల అండ లేదు. నన్ను నేను నమ్ముకొన్నాను. నా పోరాటాన్ని సినీ పెద్దలు తొక్కేశారు. బాల్యం నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు, సినిమా ఇండస్ట్రీ నన్ను బోల్డ్‌గా చేశాయి. పడుకోకపోతే హీరోయిన్ కాలేవు అని చెప్పడం వల్లే ఇష్టం లేకపోయినా కొన్ని పనులు నేను చేశాను.

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ ఆపాలంటూ ఫిర్యాదుపై... ఎలక్షన్ కమీషన్ ఫస్ట్ రియాక్షన్!‘లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ ఆపాలంటూ ఫిర్యాదుపై... ఎలక్షన్ కమీషన్ ఫస్ట్ రియాక్షన్!

     చేయకూడని పనులు చేశాను

    చేయకూడని పనులు చేశాను

    నా వ్యక్తిత్వానికి సరిపడని విషయాలు ఎదురు కావడంతో నేను కొన్ని చేయకూడని పనులు చేశాను. ఎవరైనా పుట్టుకతోనే వ్యభిచారి అవుతారా? పరిస్థితుల వల్ల నేను అలా బోల్డ్‌గా తయారయ్యాను. ఇండస్ట్రీ నా జీవితాన్ని చిదిమేసిందా అంటే నేను కచ్చితంగా చెప్పలేను.

     మీడియా నాపై దారుణంగా కథనాలు

    మీడియా నాపై దారుణంగా కథనాలు

    నాపై మీడియా ఒక్కోసారి నాపై ఒక్కో రకంగా చిత్రీకరిస్తున్నది. ఒక్కో రోజు మంచిదంటారు. మరో రోజు చెడ్డదంటారు. నన్ను టాలీవుడ్ బ్యాన్ చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిషేధించిందంటున్నారు. కానీ నేనే టాలీవుడ్‌ను, తెలంగాణను నిషేధించాను అని శ్రీరెడ్డి అన్నారు.

     నేను ఒంటరిగా ఉన్నప్పుడు

    నేను ఒంటరిగా ఉన్నప్పుడు

    నేను ఒంటరిగా ఉంటే ధ్యానం చేసుకొంటాను. సద్దురు, చాగంటి బోధనలు వింటాను. నా గురించి తెలిసిన వాళ్లకే నేనేంటో తెలుస్తుంది. మీడియా చెప్పిన వక్రభాష్యాలకు నేను బలి అయ్యాను. సినీ పెద్దలు అండగా నిలువలేదు. ఒంటరిగా నీవు ఏమి చేయలేదని చెప్పారు. సినీ ఇండస్ట్రీలో చెడ్డవ్యక్తులకే సన్మానాలు, చప్పట్లు కొడుతున్నారు.

     ఏ ఉద్యమానికైనా బ్రేకులు తప్పలేదు

    ఏ ఉద్యమానికైనా బ్రేకులు తప్పలేదు

    సెన్సేషన్ క్రియేట్ చేయడానికి, అవకాశాల కోసమో మీ టూ ఉద్యమం చేయలేదు. కాకపోతే చరిత్రలో ఏ ఉద్యమానికైనా బ్రేకులు పడ్డాయి. ఈ ఉద్యమం ఇంకా ఆగిపోలేదు. మళ్లీ శక్తిమంతమైన ఉద్యమంగా రూపుదాల్చుకోవడం జరుగుతుంది. బాలీవుడ్‌లో పెద్ద ఉద్యమం జరిగింది. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు కనపడుతున్నాయంటే ఉద్యమ ఫలితమే.

    English summary
    Sri reddy once again made serious comments on Tollywood and Telangana Government. I was not banned by anyone, My self banned Telugu, Telangana people. She alleges tollywood big wigs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X