వామ్మో ఇదేం దారుణం సామీ: పవన్‌తో శ్రీరెడ్డి రొమాంటిక్ ఫోజు.. నా టెస్టును గుర్తించండ్రా అంటూ!
శ్రీరెడ్డి.. కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతోన్న పేరిది. దీనికి కారణం ఈమె ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారడమే. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ప్రవేశించిన ఆమె.. అంతగా గుర్తింపును అందుకోలేకపోయింది. కానీ, కాస్టింగ్ కౌచ్.. నగ్న నిరసన.. సినీ పెద్దలపై విమర్శలు ఇలా పలు రకాల పనుల వల్ల ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడంతో ఆమె మరింత హాట్ టాపిక్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా శ్రీరెడ్డి.. జనసేనానితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
కియారా గ్లామర్ మోత.. వైరల్‌గా లేటేస్ట్ ఫోటోషూట్

సినిమా తక్కువే.. పాపులరిటీ ఎక్కువ
నటన మీద ఉన్న ఆసక్తితో హైదరాబాద్‌లో అడుగు పెట్టింది తెలుగు అందం శ్రీరెడ్డి. ఈ క్రమంలోనే మోడల్‌గానూ మారింది. ఆ సమయంలో ఓ న్యూస్ చానెల్‌లో ప్రమోటర్‌గానూ పని చేసింది. ఇక, 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాతో పరిచయమై... ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసింది. తక్కువ చిత్రాల్లోనే నటించినప్పటికీ ఎక్కువ పాపులర్ అయింది.

ఆ ఉద్యమంతో చుక్కలు చూపించింది
సినిమా అవకాశాలు దొరకని సమయంలో శ్రీరెడ్డి చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. సరిగ్గా అప్పుడే తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే చాలా మంది ప్రముఖులపై కామెంట్లు కూడా చేసింది. ఇలా చాలా మందికి చుక్కలు చూపించింది. అలాగే, ఫిలిం ఛాంబర్ ముందు నగ్న నిరసనకు దిగి దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది.

వాళ్లందరనీ టార్గెట్ చేసిన హాట్ బ్యూటీ
కాస్టింగ్ కౌచ్ ఉద్యమం సమయంలో పలువురు పెద్దలను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత కూడా సినీ ప్రముఖులపై షాకింగ్ కామెంట్లు చేస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా తెలుగులో ఉన్న కొందరు స్టార్ హీరోలపై ఊహించని వ్యాఖ్యలు చేసి తరచూ వార్తల్లో నిలిచిందామె. అలాగే, కొంత మంది హీరోయిన్ల బ్యాగ్రౌండ్‌పై, వాళ్ల బాడీపై వివాదాస్పదంగా మాట్లాడి విమర్శలను ఎదుర్కొందామె.

ఆ నాయకులను కూడా వదలకుండా
సినిమా వాళ్లనే కాదు.. తెలుగు రాష్ట్రాలోని రాజకీయ నాయకులపైనా ఫోకస్ చేసింది శ్రీరెడ్డి. ఇందులో భాగంగానే పలువురు బడా పొలిటీషియన్లపై సంచలన ఆరోపణలు చేసింది. మరీ ముఖ్యంగా ఓ నాయకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. దీనితో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలనూ టార్గెట్ చేసిన ఆమె.. జనసేనానిపై ఎన్నో రకాల కామెంట్లు చేసింది.

అందాలతో కనువిందు.. పవన్ ఫొటోతో
శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. చాలా కాలంగా అందులో నుంచే తన అభిప్రాయాలను వెల్లడిస్తోంది. అలాగే, గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే బూతులతోనూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కల్యాణ్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నా టెస్టును గుర్తించండ్రా అంటూ ఫన్నీగా
ప్రభాస్ నటిస్తోన్న 'రాధే శ్యామ్' పోస్టర్ ఆ మధ్య విడుదలైంది. దీనిని మార్ఫింగ్ చేసిన నెటిజన్లు హీరో హీరోయిన్ల స్థానంలో పవన్, శ్రీరెడ్డిని పెట్టారు. ఆ ఫొటోను షేర్ చేసిన ఆమె.. 'అరేయ్ ఏంట్రా ఇది? నాకో టేస్ట్ ఉందని గుర్తించండిరా. నన్ను ఇలా కించపరుస్తున్నారేంటిరా?' అంటూ కామెంట్ చేసింది. దీంతో ఈ ఫొటో నెట్‌లో వైరల్‌గా మారింది. దీనికి విచిత్రమైన కామెంట్లు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











