బిగ్ బాస్ 2: ఓవర్ చేస్తున్నాడు, అతడి పని పట్టండి... కౌశల్ ఆర్మీకి శ్రీరెడ్డి సూచన!

కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం చేసిన శ్రీరెడ్డి టాలీవుడ్లో పలువురు ప్రముఖులను టార్గట్ చేసిన సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ హోస్ట్ నాని మీద కూడా ఆమె ఆరోపణలు చేశారు. తనకు బిగ్‌బాస్ అవకాశం రాకుండా చేసింది నాని అంటూ గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్ నుండి కోలీవుడ్ పరిశ్రమకు మకాం మార్చి తమిళ సినిమాల్లో బిజీ అయిన ఈ వివాదాస్పద నటి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు. తాజాగా బిగ్ బాస్ షో, కౌశల్ ఆర్మీ గురించి శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 చాలా ఓవర్ చేస్తున్నాడు

చాలా ఓవర్ చేస్తున్నాడు

బిగ్ బాస్ షోకు సంబంధించి ఆమె ఒకరిపై.... మారు పేరుతో విమర్శలు చేశారు. బిగ్ బాస్ షోలో నూని(?) ఓవరాక్షన్ చాలా ఎక్కువ అవుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. శ్రీరెడ్డి ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

కౌశల్ ఆర్మీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు

కౌశల్ ఆర్మీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు

ఈ సందర్భంగా కౌశల్ ఆర్మీకి శ్రీరెడ్డి తన మద్దతు ప్రకటించింది. ఆర్మీ మరింత బలంగా దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. అయితే పొరపాటున కూడా ఇతర కంటెస్టంట్లను ట్రోల్ చేసి బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దని శ్రీరెడ్డి ఈ సందర్భంగా సూచించారు.

నూని పని పట్టండి, లేడీస్‌ను ఏమీ అనొద్దు

నూని పని పట్టండి, లేడీస్‌ను ఏమీ అనొద్దు

నూని(?) పని పట్టండి. అతడిపై ఎన్ని కామెంట్స్ అయినా చేయండి. అయితే బిగ్‌బాస్ ఇంట్లో కంటెస్టెంట్లుగా ఉన్న వారిపై ఎలాంటి కామెంట్స్ చేయొద్దు. ముఖ్యంగా ఆడవారిని ఏమీ అనొద్దు అని ఈ సందర్భంగా శ్రీరెడ్డి సూచించారు.

బిగ్ బాస్ 2 విజేత కౌశల్

బిగ్ బాస్ 2 విజేత కౌశల్

బిగ్ బాస్ 2 విజేత కౌశల్ మాత్రమే అని ఈ సందర్భంగా శ్రీరెడ్డి తేల్చి చెప్పారు. అందరూ అతడికి ఓటు వేయండి. బిగ్ బాస్ హౌస్‌లో అందరికంటే బలమైన కంటెస్టెంట్, ఎక్కువ మంది ప్రేక్షకుల సపోర్ట్ ఉన్న వ్యక్తి కౌశల్ మాత్రమే అని శ్రీరెడ్డి అన్నారు.

గతంలో కౌశల్ మీద శ్రీరెడ్డి విమర్శలు

గతంలో కౌశల్ మీద శ్రీరెడ్డి విమర్శలు

ఇపుడు కౌశల్‌కు సపోర్ట్ చేస్తున్న శ్రీరెడ్డి... బిగ్ బాస్ షో ప్రారంభమైన కొత్తలో కౌశల్ మీద విమర్శలు చేస్తూ పోస్టులు చేశారు. ఇపుడు అదే కౌశల్‌కు మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X